RC 16: రాంచరణ్, బుచ్చిబాబు చిత్రం నుంచి క్రేజీ అప్డేట్.. 'సైరా' డీవోపీ ఫిక్స్
మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్ పై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ చిత్రం గురించి బయటకి వస్తున్న ఒక్కో అంశం ఆసక్తిని పెంచేలా ఉంది. ఇండియన్ నేచర్, మట్టి కథ అని రాంచరణ్ ఆల్రెడీ చెప్పారు.
మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్ పై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ చిత్రం గురించి బయటకి వస్తున్న ఒక్కో అంశం ఆసక్తిని పెంచేలా ఉంది. ఇండియన్ నేచర్, మట్టి కథ అని రాంచరణ్ ఆల్రెడీ చెప్పారు. అయినప్పటికీ అంతర్జాతీయంగా ఆకట్టుకునే బలం ఈ కథలో ఉందని చరణ్ తెలిపాడు.
ఈ చిత్రం ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో ఉండబోతున్న సంగతి తెలిసిందే. దీనికోసం బుచ్చిబాబు అండ్ టీం ఉత్తరాంధ్ర యాస బాగా మాట్లాడగలిగే నటీనటుల కోసం ఆడిషన్స్ జరిగాయి. ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఐతే జోరుగా సాగుతోంది. కానీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే క్లారిటీ లేదు.
షూటింగ్ మొదలు కావాలంటే ముందుగా కెమెరా మెన్ ఎవరో ఫిక్స్ కావాలి. తాజాగా చిత్ర యూనిట్ దానికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ విడుదల చేసింది. క్రేజీ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ చిత్రానికి ఫిక్స్ అయ్యారు. నేడు రత్నవేలు పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఈ ప్రకటన చేసింది.
రత్నవేలు గతంలో మెగాస్టార్ చిరంజీవి సైరా, ఖైదీ నెంబర్ 150 చిత్రాలతో పాటు రజనీకాంత్ రోబో, రాంచరణ్ రంగస్థలం చిత్రానికి కూడా సినిమాటోగ్రాఫర్ గా చేశారు. దీనితో రాంచరణ్, బుచ్చిబాబు మరోసారి రత్నవేలుపై నమ్మకం ఉంచారు. సినిమాటోగ్రాఫర్ కూడా ఫైనల్ కావడంతో ఇక షూటింగ్ కూడా త్వరలోనే మొదలవుతుందని సంకేతాలు వినిపిస్తున్నాయి.