Bigg Boss Telugu 7: హౌజ్‌లోకి రతిక, శుభ శ్రీ, దామిని రీఎంట్రీ.. ఇదేం ట్విస్ట్.. యావర్‌కి నాగ్ వార్నింగ్
బిగ్ బాస్ శనివారం ఎపిసోడ్‌కి సంబంధించి విడుదలైన ప్రోమో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇందులో యావర్ కెప్టెన్ అయిన తర్వాత చాలా మార్పు వచ్చిందట. ఆ విషయాన్ని నాగ్ చెప్పారు. యాటిట్యూడ్ పెరిగింది కదా అన్నారు.

బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ అంతా ఉల్టా పుల్టా అని హోస్ట్ నాగార్జున చెబుతూ వస్తున్నాడు. వరుసగా అలాంటి సంఘటనలే చోటు చేసుకుంటున్నాయి. కొత్తగా వైల్డ్ కార్డ్ ద్వారా ఐదుగురు కంటెస్టెంట్లు హౌజ్‌లోకి వచ్చారు. దీంతో మళ్లీ హౌజ్ 15కి చేరింది. గౌతమ్‌ని రెండు రోజులు సీక్రెట్ రూమ్‌లో పెట్టిన విషయం తెలిసిందే. మళ్లీ ఆయన్ని హౌజ్‌లోకి తీసుకొచ్చారు. దీంతో కొత్తవాళ్లు పోటుగాళ్లుగా, పాత వాళ్లు ఆటగాళ్లుగా నిర్ణయించి గేమ్ ఆడిస్తున్నారు. ఈ క్రమంలో జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో యావర్ విజేతగా నిలిచారు. ఈ సీజన్‌లో బిగ్ బాస్ హౌజ్‌లో రెండో కెప్టెన్‌గా యావర్ నిలిచారు.
తాజాగా బిగ్ బాస్ శనివారం ఎపిసోడ్‌కి సంబంధించి విడుదలైన ప్రోమో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇందులో యావర్ కెప్టెన్ అయిన తర్వాత చాలా మార్పు వచ్చిందట. ఆ విషయాన్ని నాగ్ చెప్పారు. యాటిట్యూడ్ పెరిగింది కదా అన్నారు. ఈ మేరకు జరిగిన పరిణామాలను చూపించారు. అంతేకాదు హౌజ్‌లో రాత్రి ఇంటి సభ్యుల మధ్య జరిగిన వాదనలోనూ అదే నిరూపితమయ్యింది. అమర్, యావర్ ఫుడ్ విషయంలో చర్చిస్తున్నారు. తినే దగ్గర, తాగే దగ్గర ఇలా చేయకూడదు యావర్ అని అమర్ అనగా ఈ ఇద్దరి మధ్య వాదన పెరిగింది.
మధ్యలో సందీప్ వచ్చి కలగచేసుకున్నారు. `అరే.. `అంటూ మాట్లాడే ప్రయత్నం చేయగా, అరే ఏంటి అని ప్రశ్నించాడు యావర్. అరే అనకూడదా? అంటూ కాస్తా ఘాటుగా మాట్లాడుకున్నారు. ఫ్రెండ్స్ కదా అంటే ఫ్రెండ్సే అయితే ఏంటీ? అనేలా యావర్ రియాక్ట్ కావడం ఆశ్చర్యపరిచింది. దీంతో హౌజ్‌లో అందరు కెప్టెన్ అయిన అంతలోనే ఇంత మార్పా అంటూ గుసగుసలాడుకున్నారు. దీనిపై నాగార్జున నిలదీశాడు. వారిద్దరు మాట్లాడుకుని సాటౌట్ చేసుకుంటున్నారు. మధ్యలో నువ్వెందుకు వెళ్లావు సందీప్ ని అడిగాడు, అంతేకాదు నీ వల్ల గొడవ ఇంకా పెరిగింది అని చెప్పగా, సందీప్ వద్ద మాట లేదు. ఈ క్రమంలో యావర్‌కి వార్నింగ్ ఇచ్చాడు నాగ్. డిక్టేటర్‌గా వ్యవహరించిన ఎవరైనా తుడిచిపెట్టుకుపోయారని తెలిపారు. హుందాగా ఉండాలని వెల్లడించారు.
ఇందులో ఓ ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించాడు బిగ్ బాస్. హౌజ్‌లోకి మరో ముగ్గురు కంటెస్టెంట్లు రీఎంట్రీ ఇవ్వడం విశేషం. వరుసగా హౌజ్ నుంచి ఎలిమినేట్ అయిన రతిక, శుభ శ్రీ, దామినీలు మళ్లీ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చి అందరిని సర్‌ప్రైజ్ చేశారు. దీంతో చెప్పాను కదా ఈ సీజన్ బిగ్ బాస్ షో మొత్తం ఉల్టా పుల్టా అని అన్నట్టుగానే ట్విస్టులు చోటు చేసుకోవడం విశేషం. అయితే వాళ్లు జస్ట్ గెస్టులుగా సందడి చేసి వెళ్లిపోతారని తెలుస్తుంది.