Asianet News TeluguAsianet News Telugu

తెరపైకి రతిక, రాహుల్‌ సిప్లిగంజ్‌ ప్రేమ వ్యవహారం.. బిగ్‌ బాస్‌ భామ పేరెంట్స్ రియాక్షన్‌ ఇదే.. అసలేం జరిగింది?

ఆస్కార్‌ విన్నింగ్‌ సాంగ్‌ పాడిన రాహుల్‌ సిప్లిగంజ్‌.. బిగ్‌ బాస్‌ భామ రతికతో ప్రేమలో ఉన్నట్టు ఆ మధ్య వార్తలొచ్చాయి. అయితే దీనిపై వారి పేరెంట్స్ స్పందించారు. ఏం జరిగిందో చెప్పారు.

rathika parents open up love with rahul sipligunj what happened arj
Author
First Published Nov 3, 2023, 8:46 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 7లో సందడి చేస్తుంది రతిక రోజ్‌. ఆమె హౌజ్‌ నుంచి వెళ్లిపోయి మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. ఏదో రూపంలో హాట్‌ టాపిక్‌ గా మారుతుంది. హౌజ్‌లో కంటెంట్‌ ఇస్తుంది. అయితే ఇటీవల ఆమె లవ్‌ వ్యవహారం బయటపడింది. బిగ్‌ బాస్‌ షోకి వచ్చినప్పుడే లవ్‌ బ్రేకప్‌ విషయంలో తాను బాధపడుతున్నట్టు చెప్పింది. హౌజ్‌లోనూ పలు మార్లు ఆ విషయాన్ని గుర్తు చేసుకుంది. ఇంకోవైపు హౌజ్‌లోకి వచ్చిన ప్రారంభంలోనే పల్లవి ప్రశాంత్‌ తో పులిహోర కలిపింది. ఆయన చెప్పిన మాటకు తలూపుతూ, రియాక్ట్ అవుతూ రచ్చ చేసింది. కానీ అనూహ్యంగా ఆయనకి పెద్ద షాకిచ్చింది. 

రతిక తీరుపట్ల చాలా విమర్శలు వచ్చాయి. అటు హౌజ్‌లో, ఇటు బయట ఆమెపై నెగటివ్‌ ఎక్కవైంది. దీంతో హౌజ్‌ని వీడాల్సి వచ్చింది. అయితే మరో ఛాన్స్ వచ్చింది. ఆమెకి ఓటింగ్‌లో ఎక్కువ ఓట్లు పడటంతో మళ్లీ హౌజ్‌లోకి అడుగుపెట్టింది. రచ్చ రచ్చ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రతిక ఎక్స్ లవ్‌ స్టోరీ వార్తల్లో నిలిచింది.రాహుల్‌ సిప్లిగంజ్‌తో ఆమె ప్రేమలో మునిగి తేలిందని, ఆ తర్వాత బ్రేకప్‌ చెప్పుకున్నారని ఆ మధ్య వార్తలొచ్చాయి. తాజాగా దీనిపై రతిక పేరెంట్స్ స్పందించారు. 

రతిక తండ్రి రాములు, తల్లి అనితలది వికారాబాద్‌ జిల్లా జనగామకి గ్రామం. ప్రస్తుతం తాండూరులో ఉంటున్నారు. ముగ్గురు అమ్మాయిలల్లో రతిక రెండో అమ్మాయి. ఇద్దరి పెళ్లిళ్లు అయ్యాయి. రతిక సినిమాలు, సీరియల్స్ లో రాణిస్తున్న నేపథ్యంలో వారి ఫ్యామిలీకి పెద్ద సపోర్ట్ సిస్టమ్‌గా మారింది. ఈ నేపథ్యంలో రతిక ఈ స్థాయిలో ఉండటంపై స్పందిస్తూ, మొదట్లో `పటాస్‌` షోలో ఆఫర్‌ వచ్చిందట, అప్పుడు ఈ స్థాయికి వస్తుందని ఊహించలేదట. ఇంటర్‌సెకండీయర్‌లో ఉన్నప్పుడు విజయ్‌ నిర్మల తీసిన `ఈ జన్మ నీకే` అనే సినిమాలో సెకండ్‌ హీరోయిన్‌గా ఆఫర్ వచ్చిందట. మహేష్‌ తల్లి సినిమా అని తెలిసి షూటింగ్‌కి వెళ్లిందట, కానీ ఆ సినిమా ఆగిపోయిందని చెప్పారు. 

ఈ క్రమంలో రాహుల్‌ సిప్లిగంజ్‌.. రతికతో రెండు మూడు పాటలు చేశాడట. ఆ సమయంలో ఏర్పడిన పరిచయంతో రాహుల్‌ వాళ్ల ఇంటికి కూడా వెళ్లారట. అంతేకాదు వారి చిన్న అమ్మాయి పెళ్లికి కూడా రాహుల్‌ వచ్చాడట. ఆసమయంలో తమ వద్ద ఎలాంటి పెళ్లి ప్రస్తావన రాలేదు. ఓ రోజు మా అమ్మాయికి పెళ్లి కావాలి, ఇలా పాటలు తీస్తే ఎలా అని ఆయన్ని బెదిరించారట. ఆ సమయంలో ఊర్లో కూడా నానా రకాలుగా అనుకున్నారు. వాడితోనే డాన్సులు చేస్తుంది, వాడితోనే పోతుందని రకరకాలుగా అన్నారని రతిక తండ్రి తెలిపారు. 

అయితే వాటిని తాము పట్టించుకోలేదన్నారు రాములు. రాహుల్‌ కూడా అందరిలాగే పెళ్లికి వచ్చిండు, కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదు. రతికా అందరికి ఫ్రెండ్‌లాగే ఉంటుంది, ఫ్రెండ్స్ గానే భావిస్తుంది. బిగ్‌ బాస్‌ షోలో పల్లవి ప్రశాంత్‌తో కూడా ఒక స్నేహితుడిలాగే మాట్లాడింది, కానీ దాన్ని బయట కావాలని రూమర్స్ క్రియేట్‌ చేశారని తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios