Asianet News TeluguAsianet News Telugu

దామినిపై సహనం కోల్పోయిన రతిక.. కెమెరా అటెన్షన్ కోసం ట్రిక్స్ అంటూ షకీలా సెటైర్లు 

దామినిపై రతిక సహనం కోల్పోయి గట్టిగా కేకలు వేసింది. దీనితో దామిని కూడా కన్నీరు పెట్టుకుంటూనే రతిక బుర్రలేని ఒక చైల్డ్ అని పేర్కొంది.

Rathika loose her control on damini in bigg boss house dtr
Author
First Published Sep 14, 2023, 10:43 PM IST

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 తొలి వారం అంతా గందరగోళంగా మారింది. అంతా మారిపోయింది అని చెప్పారు కానీ.. గందరగోళం అవుతోందనే కామెంట్స్ ఆడియన్స్ నుంచి వినిపిస్తున్నాయి. హౌస్ లో 11వ రోజు బుధవారం జరిగిన ఎపిసోడ్ లో రతిక రోజ్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. 

ఆమె ఏకంగా ఇల్లు పీకి పందిరి వేసినట్లు రచ్చ చేసింది. హౌస్ లో మహాబలి, రణధీరా రెండు సమూహాలుగా విడిపోయి పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. రెండు టీమ్స్ అస్త్రాలు వేటలో ఉన్నాయ్. అయితే గురువారం రోజు బిగ్ బాస్ ఆసక్తికర టాస్క్ ఇచ్చారు. ఆల్రెడీ అస్త్రాలు భాగాలు ఎవరి దగ్గర ఉన్నాయో తెలుసు. వారిలో అస్త్రం సాధించే అర్హత లేని వారి దగ్గర నుంచి ఆ భాగాలు తీసుకుని అదే టీంలో మరో సభ్యుడికి ఇవ్వాలని బిగ్ బాస్ తెలిపారు. 

ఈ క్రమంలో ముందుగా శుభశ్రీ.. శోభా శెట్టి నుంచి అస్త్రం భాగాన్ని యావర్ కి అందించింది. అలాగే పల్లవి ప్రశాంత్ అమర్ నుంచి శివాజీకి అందించారు. అయితే ఇక్కడ రతిక మామూలు రచ్చ చేయలేదు. తన టీమ్ లోని అందరితో గొడవ పడుతూ బీభత్సం సృష్టించింది. 

ముఖ్యంగా దామినిపై రతిక సహనం కోల్పోయి గట్టిగా కేకలు వేసింది. దీనితో దామిని కూడా కన్నీరు పెట్టుకుంటూనే రతిక బుర్రలేని ఒక చైల్డ్ అని పేర్కొంది. బయట అంతా సమావేశం అయినప్పుడు రతిక మాట్లాడుతూ ఇలాంటి టీమ్ లో ఉన్నందుకు నాకు చాలా ఛండాలంగా అనిపిస్తోంది. నా టీంలో ఉన్నవాళ్ళంతా బఫూన్స్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. 

దీనితో స్పెక్టేటర్ గా ఉన్న ఆట సందీప్.. రతిక పై మండిపడ్డారు. వాళ్ళిద్దరికీ కూడా వాగ్వాదం జరిగింది. అలాగే షకీలా కూడా రతిక పై సెటైర్ వేసింది. ఆమె ఏదో కెమెరా అటెన్షన్ కోసం ప్రయత్నిస్తోంది అంటూ షకీలా రతిక పై బాంబు పేల్చడం విశేషం.  ఆ రకంగా రతిక రచ్చతో నేటి ఎపిసోడ్ ముగిసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios