Asianet News TeluguAsianet News Telugu

కన్ ఫ్యూజ్ చేసే రాశి 'లంక'..!.. రివ్యూ

  •  

  • చిత్రం : లంక‌
  • దర్శకత్వం : శ్రీముని
  • నిర్మాత : నమన దినేష్, నమన విష్ణు కుమార్
  • సంగీతం : శ్రీ చరణ్ పాకల
  • నటీనటులు : రాశి, సాయి రోనక్, ఎన సాహ
  • ఏసియానెట్ రేటింగ్- 2.5

 

RASSI LANKA HAS LOT OF CONFUSION

కథ :

మలయాళ స్టార్ హీరోయిన్ అయిన స్వాతి (ఎన సాహ) తన పర్సనల్ పని మీద హైరదరాబాద్ వస్తుంది. ఆమె పని పూర్తై తిరిగి వెళ్లిపోదామనుకునే సమయానికి   సాయి (సాయి రోనక్), సుదర్శన్ లు సినిమా రంగంలో రాణించాలనే తపనతో ముందు ఓ షార్ట్ ఫిల్మ్ తీయాలని ప్లాన్ చేస్తారు. ఆ షార్ట్ ఫిల్మ్ లో హీరోయిన్ గా స్వాతిని సెలెక్ట్ చేస్తాడు సాయి. ఆ తర్వాత కథ మొత్తం రెబెకా (రాశి) గెస్ట్ హౌస్ కు మారుతుంది. గెస్ట్ హౌజ్ కు చేరుకున్న స్వాతిని రెబెకా తన టెలీపతితో ఇబ్బంది పెట్టడం మొదలుపెడుతుంది.

అలా కథ నడుస్తుండగా స్వాతి ఉన్నట్టుండి కనబడకుండా పోతుంది. దాంతో పోలీసులు రెబెకాను అనుమానిస్తారు. అసలు రెబెకా స్వాతిని ఎందుకు ఇబ్బంది పెట్టింది ? ఈ టెలీపతి ఏమిటి ? అనే అంశాలు తెసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

 

నటీనటులు :

సినిమా ప్రమోషన్స్ లో రాశీ  ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా ఉండిందో తన క్యారక్టరైజేషన్ చూస్తే అర్ధమవుతుంది. ఇక హీరో హీరోయిన్ సాయి రోనక్, ఐనా సాహా లు కూడా బాగానే చేశారు. ఐనా సాహా అభినయం బాగుంది. శీజు రెండు డైఫెరెంట్ పాత్రలకు పూర్తిస్థాయి న్యాయం చేశాడు. ఇక సత్యం రాజేష్, సత్య, సుప్రీత్ లు పరిధి మేరకు నటించి మెప్పించారు.

 

ప్లస్ పాయింట్స్ :

టెలీపతి ఆధారంగా సాగే కథ కావడంతో సినిమా కాస్త ఆసక్తికరంగా ఉంది. చాలా ఏళ్ల తర్వాత ఒక ప్రాముఖ్యత ఉన్న పాత్రలో నటించిన రాశి నటన బాగుంది. క్లైమాక్స్ లో అయితే బాగా ఆకట్టుకుంది. మొదటి అర్థ భాగంలో సత్య అతని స్నేహితుల ద్వారా పండించిన కామెడీ అక్కడక్కడా నవ్వించింది. అలనాటి హీరోయిన్ రాశి లీడ్ రోల్ చేసిన ఈ లంక మూవీ తన అభిమానులకు ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పొచ్చు. ఒకప్పటి హీరోయిన్స్ అంతా అమ్మ అక్క పాత్రలను చేస్తూ వస్తుంటే తను మాత్రం కొత్త ప్రయత్నంగా లంకతో వచ్చింది. రెబికాగా మరోసారి తన నట విశ్వరూపం చూపించింది రాశి. 

 

మైనస్ పాయింట్స్ :

సినిమాలోని అతి పెద్ద డ్రాబ్యాక్ అంటే అది సంక్లిష్టంగా మారిన కథనమనే చెప్పాలి. దాని వలన ఒకానొక దశలో అసలు సినిమాలో ఏం జరుగుతోంది అర్థం కాదు. సినిమాను ఆసక్తికరంగా తయారు చేయాలన్న ప్రయత్నంలో ఎక్కువ ఉప కథలు, అనవసరమైన ట్విస్టులు పెట్టి ఇరిటేట్ చేశారు. శ్రీముని డైరెక్ట్ చేసిన ఈ సినిమా కథ బాగానే ఉన్నట్టు అనిపించినా కథనంలో అతను సరిగా డీల్ చేయలేదని చెప్పొచ్చు. కథనం ఇంకాస్త గ్రిప్పింగ్ తో రాసుకుంటే బాగుండేది.

చిన్న బడ్జెట్ లో ఆడియెన్స్ ను ఆకట్టుకునేలా చేయాలంటే అది కచ్చితంగా సస్పెన్స్ థ్రిల్లర్స్ మాత్రమే అయ్యుండాలి. ఆ ప్రయత్నంలో ఎన్నో సినిమాలు సక్సెస్ సాధించగా అదే దారిలో వచ్చింది లంక మూవీ. కథ విషయంలో కాస్త కొత్తదనం కనిపించినా కథనంలో ఏమాత్రం ఆకట్టుకోలేదు దర్శకుడు. రాశి క్యారక్టరైజేషన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఇక నేరేషన్ కూడా అంతా సాగదీతగా ఉంటుంది. ఇలాంటి కథలకు ఎంత గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉంటే అంత బాగుంటుంది. కాని ఆ విషయంలో చాలా పొరపాట్లే కనిపిస్తాయి. సాధారణ ప్రేక్షకుడు అర్ధం కాని రీతిలో కథ కథనాలను మార్చి కన్ ఫ్యూజ్ చేసేశారు. కొన్ని ఊహాజనిత సీన్స్ ఆడియెన్స్ నమ్మే లోపే అవి అబద్ధమంటూ చెప్పేసరికి ఏది నిజం ఏది అబద్ధం అనే డైలామాలో పడతారు ఆడియెన్స్.

 

చివరగా..
లెక్క‌లేన‌న్ని మ‌లుపులు..అర్థంలేని ట్విస్టులు

Follow Us:
Download App:
  • android
  • ios