ఛలో చిత్రంతో తెలుగు కు పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ ర‌ష్మిక మందన్న . ఆ సినిమా లో ఆమె నటన , క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో యూత్ ని తన మాయలో పడేసి థియోటర్స్ ఛలో అనేంతగా అట్ట్రాక్ట్ చేసింది. ఇక ఆ తరువాత వచ్చిన గీత గోవిందం లో ఆమె నటన గురించి చెప్పక్కర్లేదు. ఆ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ..అదే స్దాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. 

విజయ్ దేవరకొండ తో జతకట్టి 100 కోట్ల హీరోయిన్ క్లబ్ లో జాయిన్ అయిపోయింది. అదే ఊపులో నానితో దేవదాస్ చేసి మెప్పించింది. వరస సక్సెస్ లు  అందుకున్న ఈ భామ స్టార్ హీరోయిన్ గా సెటిల్ అవుతున్న ఈ సమయంలో తమిళంలోనూ ఆఫర్స్ వస్తున్నాయని వినికిడి. అయితే ఆమె ఆచి తూచి అడుగులు వేస్తోంది. 

ఈ క్రమంలో తమిళ స్టార్ హీరో విజయ్ ప్రక్కన ఆమెకు ఛాన్స్ ఉన్నట్లు తమిళ మీడియాలో గుప్పుమంది. ఈ విషయమై సోషల్ మీడియాలో ఆమెకు కంగ్రాట్స్ చెప్తూ పోస్ట్ లు సైతం పడిపోయాయి. అయితే ఇప్పటివరకూ అలాంటిదేమీ లేదని..అవన్ని నిజం కావాలని కోరుకుంటున్నట్లు ఆమె రిప్లై ఇచ్చింది. ఇంతకీ ఏ సినిమా కోసం అంటే...అట్లీతో మరో సారి విజయ్ చేయబోయే చిత్రం.

ప్రముఖ దర్శకుడు శంకర్‌ వద్ద శిష్యరికం చేసిన అట్లి తొలిచిత్రం ‘రాజా రాణి’తో సూపర్ హిట్ కొట్టి తమిళ,తెలుగు భాషల్లో తనకంటూ ఓ స్దానం ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత విజయ్‌తో ‘తెరి’ని తెరకెక్కించి స్టార్‌ డైరెక్టరుగా మారారు. మళ్లీ విజయ్‌తో ‘మెర్సల్‌’(అదిరింది)ను రూపొందించి.. బిగ్గెస్ట్‌ హిట్‌ను సొంతం చేసుకున్నారు. 

ఇప్పుడు విజయ్‌తోనే మరో చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇది విజయ్‌కి 63వ చిత్రం. ‘మెర్సల్‌’కు సంగీతం అందించిన ఏఆర్‌ రెహ్మాన్‌ దీనికి కూడా సంగీతం సమకూర్చుతున్నారు. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.  ఈ నేపధ్యంలో రష్మిక పేరు హాట్ టాపిక్ గా మారిం