రష్మిక మరో తెలుగు సినిమా ప్రకటన.. `భీష్మ` కాంబినేషన్ రిపీట్.. అంతకు మించి అనేలా `వీఎన్‌ఆర్ ట్రియో`
మూడేళ్ల క్రితం వచ్చిన `భీష్మ` చిత్రం పెద్ద విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇదే కాంబినేషన్ ఇప్పుడు రిపీట్ కాబోతుంది. తాజాగా ఉగాది పండుగ సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు.

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఎట్టకేలకు తెలుగు సినిమాని ప్రకటించింది. హిందీలోకి వెళ్లాక తెలుగు సినిమాలు లైట్ తీసుకుంటుందనే కామెంట్లు వినిపించిన నేపథ్యంలో ఇప్పుడు తన కొత్త సినిమాని అనౌన్స్ చేసింది. ఆమె మరోసారి హిట్ కాంబినేషన్‌తో రాబోతుంది. నితిన్‌తో మరోసారి జోడీ కడుతుంది. అంతేకాదు తనకు `భీష్మ` వంటి హిట్‌ని ఇచ్చిన దర్శకుడు వెంకీ కుడుములతో సినిమా చేస్తుంది. ఇంకా చెప్పాలంటే `భీష్మ` కాంబినేషన్ రిపీట్ కాబోతుంది. దీన్ని `వీఎన్‌ఆర్‌ట్రియో`గా ప్రకటించారు దర్శకుడు వెంకీ కుడుముల.
`వీఎన్‌ఆర్-వెంకీ కుడుముల, నితిన్, రష్మిక` ఈ ముగ్గురు కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిది. దీన్ని వెరైటీగా ఓ వీడియో ద్వారా ఈ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు. ఇందులో మొదట `ఎవరి మనోభావాలు మేం దెబ్బతీయట్లేదు, మా మనోభావాలు మేమే దెబ్బతీసుకుంటున్నాం, ధన్యవాదాలు` అని రష్మిక, నితిన్ చెప్పగా, అనంతరం సెట్‌కి నితిన్ కోక్ తాగుతూ వచ్చారు. ప్రభా.. ఇంకా ఎవరురాలేదా? అని బాయ్‌ని అడగ్గా, మార్నింగ్ 8 గంటలకు హీరోయిన్ వచ్చార్ సర్ అని చెప్పాడు.
దీంతో `సేమ్ హీరోయినా` అని ప్రశ్నంచగా, లోపలి నుంచి `సేమే యే.. `అంటూ రష్మిక బయటకు వచ్చింది. `అస్సలు డౌట్ లేదని, మా డైరెక్టర్ స్క్రిప్ట్ రాసేముందు ఓంలో మీ పేరే రాస్తాడు` అని చెప్పాడు. ఏంటి 8గంటలకే వచ్చావని నితిన్ ప్రశ్నించగా, మార్నింగ్ బాంబే ఫ్యాన్స్ తో లైవ్ పెట్టుకున్నా, ఈ షూట్ అయ్యాక ఈవినింగ్, హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, కొచ్చి ఫ్యాన్స్ తో అని చెప్పబోతుండగా, `ఓకే ఓకే నేషనల్ క్రష్‌వి కదా` అని అన్నాడు. ఇక రష్మిక శ్రీవల్లి డాన్సు చేయడం, నితిన్ తనకు ఒక్క హిట్ వస్తే, రెండు ఫ్లాప్‌లు వస్తున్నాయని చెప్పడం ఆకట్టుకుంది.
ఇంతలో జీవి ప్రకాష్ ఎంటర్ అయ్యారు. ఆయన హీరోగా మేకప్ వేసుకుంటుండగా, నేను హీరో అని నితిన్ చెప్పడంతో ఓకే ఈ సారికి మ్యూజిక్ డైరెక్టర్‌గానే ఫిక్స్ అయిపోతా అనిచెప్పడం ఆకట్టుకుంది. ఆ తర్వాత దర్శకుడు వెంకీ కుడుముల ఎంట్రీ ఇచ్చి తమ కాంబినేషన్ ప్రకటించారు. ఈ సారి అంతకు మించి ఉంటుందని చెప్పారు. దీంతో `వీఎన్‌ఆర్‌ట్రియో`ని ప్రకటించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా `భీష్మ`కి మించిన వినోదాత్మకంగా, అంతకు మించిన అడ్వెంచరస్‌గా ఉంటుందని, భారీ బడ్జెట్‌తో సినిమాని నిర్మిస్తున్నట్టు తెలిపారు.
దర్శకుడు వెంకీ కుడుముల రూపొందించిన `ఛలో`, `భీష్మ`లో రష్మికనే హీరోయిన్. ఇప్పుడు ఆయన మూడో సినిమాలోనూ హీరోయిన్‌గా ఆమెనే రిపీట్ చేయడం విశేషం. త్వరలోనే మిగిలిన వివరాలు తెలియజేస్తామని తెలిపింది యూనిట్. ఇక రష్మిక ప్రస్తుతం తెలుగులో `పుష్ప2`లో నటిస్తుంది. హిందీలో `యానిమల్` సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.