టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న సీక్రేట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆమె ఆ ఫోటోలో ఏం చేస్తోంది..? ఎక్కడికి వెళ్లింది..? 


విజయ్ దేవరకొండ తమ్మడు.. ఆనంద్ దేవరకొండ హీరోగా.. ట్రయాంగిల్‌ లవ్ కథ నేపథ్యంలో వచ్చిన సినిమా బేబి. ఈ మూవీలో ఆనంద్‌ దేవరకొండ జంటగా.. వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా నటించారు. ప్రస్తుతం మూవీ లవర్స్‌ నోట ఎక్కువగా వినిపిస్తున్న సినిమా బేబి . హృదయ కాలేయం ఫేం సాయిరాజేశ్‌ డైరెక్ట్ చేసినఈసినిమాలో విరాజ్‌ అశ్విన్‌ కీలక పాత్రలో నటించాడు. మూవీ లవర్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బేబి నేడు థియేటర్లలోలో రిలీజ్ అయ్యి సందడి చేసింది బేబీమూవీ. కాగా ఈమూవీ ప్రీమియర్ షోల నుంచి థియేటర్ల వద్ద సెలబ్రిటీలు సందడి చేశారు. దాంతో వాటి దగ్గర సందడి వాతావరణం నెలకొంది.

ఇప్పటికే విజయ్‌ దేవరకొండ, రాశీఖన్నా బేబి ప్రీమియర్‌ షోకు వెళ్లారు.. వారు థియేటర్ లో సందడి చేసిన వీడియోలు నెట్టింట హల్‌ చల్‌ చేస్తున్నాయి. ఇది ఇలా ఉండగా.. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్‌ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. బేబీ సినిమా ప్రీమియర్ చూడటానికి స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా సీక్రేట్ గా థియేటర్ కు వచ్చింది. బ్లూ జీన్స్‌, వైట్ టీ షర్ట్‌, బ్లాక్ క్యాప్‌, ఫేస్ మాస్క్‌ పెట్టుకుని బేబి సినిమాను సీక్రెట్‌గా చూసిందంటూ నెట్టింట వార్త హాట్ టాపిక్ అవుతోంది. సెలబ్రిటీ ప్రీమియర్‌ షో నడుస్తున్న స్క్రీన్‌ 1లోకి గుట్టు చప్పుడు కాకుండా బ్యాక్ డోర్ నుంచి ఎంట్రీ ఇచ్చిందట రష్మిక.

ఇక ఈక్రమంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా మధ్య ప్రేమ వార్తలు మరోసారి హల్ చల్ చేస్తున్నాయి. వీరి మధ్య ఫ్రెండ్‌ షిప్‌ గురించి మరోసారి చర్చించుకుంటున్నారు. గతంలో..ఆనంద్ దేవకొండ సినిమా ప్రమోషన్ లో మెరిసిన రష్మికను వదినా అంటూ టీజ్ చేశారు ఫ్యాన్స్. గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మరి ఇలా ఆనంద్‌ దేవరకొండ నటించిన బేబి చిత్రాన్ని రష్మిక సీక్రెట్‌గా ఎందుకు చూసిందంటూ.. నెట్టింట్లో చర్చ మొదయ్యింది.