Asianet News TeluguAsianet News Telugu

విజయ్ దేవరకొండతో స్పెషల్ సెల్ఫీ.. రష్మిక మందన్న పోస్ట్ వైరల్..

సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ ను శేర్ చేసుకుంది టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్నా. విజయ్ దేవరకొండత్ో స్పెల్ఫీపిక్ ను పోస్ట్ చేసిన బ్యూటీ.. స్పెషల్ ఈవెంట్ ను సెలబ్రేట్ చేసుకుంది. 

Rashmika Mandanna Special Post On Dear Comrade Movie JMS
Author
First Published Jul 27, 2023, 9:33 AM IST


టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా వచ్చిన సెకండ్ మూవీ  డియర్ కామ్రేడ్. భరత్ కమ్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా  రిలీజ్ ముందు నుంచే భారీగా చాలా హైప్ క్రియేట్ చేసింది.. కాని సినిమా రిలీజ్ అయిన తరువాత డిజాస్టర్ అయ్యి..  విజయ్ ఫ్యాన్స్ ను డిస్సపాయింట్ చేసిందీ సినిమా. గీత గోవిందం సూపర్ హిట్ అవ్వడంతో.. వీరిద్దరి కాంబినేషన్ వర్కౌట్ అవుతుంది అనుకున్నారు మేకర్స్.. కాని థియేటర్ లోకి వచ్చిన ఈసినిమా ఆడియన్స్ కు తలనోప్పి తెప్పించింది.  సినిమా చాలా ల్యాగ్ ఉండటం, రొటీన్ లవ్ సీన్స్, లాస్ట్ లో రొటీన్ హరాజ్మెంట్ కేసుతో నడిపించడం.. ఇవన్నీ ప్రేక్షకులని, విజయ్ ఫ్యాన్స్ ని నిరాశపరిచాయి. కలెక్షన్స్ కూడా రాక ఈ సినిమా కమర్షియల్ గా ఫ్లాప్ చూసింది. 

డియార్ కామ్రేడ్  సినిమా రిలీజ్ అయ్యి నేటికి నాలుగేళ్లు పూర్తి అయ్యింది. దాంతో ఆ మెమ్రరీస్ ను నెమరు వేసుంటున్నారు టీమ్. తాజాగా డియర్ కామ్రెడ్ పై స్పెషల్ పోస్ట్ పెట్టారు స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న. ఈ  సినిమాను గుర్తు చేసుకుంటూ.. సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఆ సినిమా విడుదలై నాలుగేళ్లు పూర్తైన  సందర్భంగా ఈసినిమా హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు భరత్ కమ్మ తె కలిసి దిగిన ఫోటోను శేర్ చేశారు. 

ఈ పోస్ట్ కు స్పెషల్ నోట్ కూడా  రాశారు రష్మిక. నా హృదయంలో ఈ సినిమాకు ఎప్పటికీ ప్రత్యేకస్థానం ఉంటుంది. ‘డియర్ కామ్రేడ్‌’కు నాలుగేళ్లు. థ్యాంక్యూ విజయ్, భరత్’’ అని ఆమె కామెంట్ చేశారు. ఈ పోస్ట్ చూసి విజయ్, రష్మిక అభిమానులు కూడా పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఇప్పటికే విజయ్ , రష్మికల మధ్య సమ్ థింగ్ సంథింత్  అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. కలిసి డిన్నర్ డేట్లు కూడా చేసి దోరికిపోయారు ఇద్దరు.  అటు మాల్దీవ్స్ ట్రిప్ కు కూడా వెళ్ళారు.. కాని బయట పడలేదు. ఇద్దరు. 

ఇక తాజాగాఆమె పెట్టిన పోస్ట్ తో విజయ్ ఫ్యాన్స్ దిల్ ఖఉష్ అవుతున్నారు. వదినమ్మ అంటూన్నారు. 2019లో విడుదలైన ‘డియర్ కామ్రేడ్‌’కు మిశ్రమ స్పందనే వచ్చినప్పటికీ విజయ్, రష్మికల ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ, లవ్ ట్రాక్ యువతను విశేషంగా ఆకట్టుకుంది. ‘గీత గోవిందం’ తరువాత విజయ్, రష్మిక హిట్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. మరి రష్మిక పోస్ట్ కు విజయ్ దేవరకొండ స్పందిస్తారా లేదు అనేది చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios