Asianet News TeluguAsianet News Telugu

అమాయకంగా డాన్స్ వేస్తున్న ఈ బేబీ ఇప్పుడు స్టార్ హీరోయిన్... తెలిస్తే షాక్ అవుతారు!

తన క్లాస్ మేట్ అయిన మరో అమ్మాయితో స్టేజ్ పై పెర్ఫార్మ్ చేస్తున్న ఆ హీరోయిన్... నా ఎక్స్ప్రెషన్ అంతగా బాగోలేదు. అది వదిలేసి నేను ఏ సాంగ్ కి డాన్స్ వేశానో ఊహించి చెప్పండి అని ఫ్యాన్స్ కి ఫజిల్ విసిరారు. అలాగే ఆమె చిన్న క్లూ కూడా ఇవ్వడం జరిగింది. 

rashmika mandanna shares her childhood pic asks gues the song she was danced for ksr
Author
Hyderabad, First Published Feb 20, 2021, 1:52 PM IST


ఓ స్టార్ హీరోయిన్ తన చిన్నప్పటి ఫోటో ఇంస్టాగ్రామ్ లో పంచుకున్నారు. ఆరు లేదా ఏడేళ్ల వయసులో ఉన్న ఆ హీరోయిన్ స్కూల్ కల్చరల్స్ లో డాన్స్ వేస్తున్నప్పటి ఫోటో అది. తన క్లాస్ మేట్ అయిన మరో అమ్మాయితో స్టేజ్ పై పెర్ఫార్మ్ చేస్తున్న ఆ హీరోయిన్... నా ఎక్స్ప్రెషన్ అంతగా బాగోలేదు. అది వదిలేసి నేను ఏ సాంగ్ కి డాన్స్ వేశానో ఊహించి చెప్పండి అని ఫ్యాన్స్ కి ఫజిల్ విసిరారు. అలాగే ఆమె చిన్న క్లూ కూడా ఇవ్వడం జరిగింది. అది 2004-2005లో వచ్చిన పాట అంటూ తన కామెంట్ లో పొందుపరచడం జరిగింది. 

ఇప్పటికే చాలా మంది ఆ హీరోయిన్ ఎవరో  గెస్ చేసే ఉంటారు. అవును ఆ బేబీ ఎవరో కాదు రష్మిక మందాన. ఒకప్పుడు స్టేజ్ పై అమాయకంగా ముఖం పెట్టి డాన్స్ వేస్తున్న రష్మిక, ఇంత పెద్ద స్టార్ అవుతుందని ఎవరూ ఊహించి ఉండరు. టాలీవుడ్ లో టాప్ స్టార్ గా ఎదిగిన రష్మిక క్రేజీ ప్రాజెక్ట్స్ తన ఖాతాలో వేసుకున్నారు. గత ఏడాది ఆమె నటించిన సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ హిట్ కాగా... భీష్మ సూపర్ హిట్ కొట్టింది. 

ప్రస్తుతం సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప మూవీలో రష్మిక హీరోయిన్ గా నటిస్తున్నారు. పుష్పలో రష్మిక డీగ్లామర్ రోల్ చేస్తున్నారని సమాచారం. అలాగే ఓ హిందీ చిత్రానికి కూడా రష్మిక సైన్ చేశారు. కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ తదుపరి చిత్రంలో రష్మిక హీరోయిన్ గా ఎంపికయ్యారంటూ వార్తలు వస్తున్నాయి. అలా సౌత్ అండ్ నార్త్ అనే భేదం లేకుండా దూసుకుపోతుంది రష్మిక. 
 

Follow Us:
Download App:
  • android
  • ios