టాలీవుడ్ లో రష్మిక మెల్లమెల్లగా స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంటోంది. తాజాగా మహేష్ బాబు సినిమాలో ఛాన్స్ కొట్టేసి అందరికీ షాక్ ఇచ్చింది. ఇక ఈ సినిమా తరువాత ఆమెకి టాలీవుడ్ లో వరుస అవకాశాలు రావడం ఖాయమని అంటున్నారు.

గతంలో ఈ బ్యూటీ కన్నడ నటుడు రక్షిత్ శెట్టిని ప్రేమించి, పెళ్లి కూడా చేసుకోవాలనుంది. నిశ్చితార్ధం కూడా చేసుకున్నారు. కానీ పెళ్లికి మాత్రం బ్రేకులు పడ్డాయి. రష్మిక టాలీవుడ్ లో బిజీ కావడమే దానికి కారణమని చెబుతారు. రష్మికతో బ్రేకప్ తరువాత సోషల్ మీడియాలో ఈ జంట గురించి సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరిగింది.

విపరీతమైన కామెంట్స్ వచ్చేవి. దాంతో రక్షిత్ సోషల్ మీడియా నుండి ఎగ్జిట్ అయ్యాడు. తన అకౌంట్ ని గత పది నెలలుగా డీయాక్టివేట్ చేసి ఉంచాడు. ఇంతకాలం సోషల్ మీడియాకి దూరంగా ఉన్న రక్షిత్ ఇప్పుడు మళ్లీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు.

జూన్ 5న అతడి పుట్టినరోజు సందర్భంగా మళ్లీ సోషల్ మీడియాలోకి రావాలని నిర్ణయించుకున్నాడు. గతంలో సోషల్ మీడియాలో కొందరు చేస్తోన్న కామెంట్స్ కారణంగా తన వర్క్ పై సరిగ్గా ఫోకస్ చేయలేకపోతున్నానని చెప్పిన రక్షిత్ సోషల్ మీడియాకి దూరమయ్యాడు. ఇప్పుడు రీఎంట్రీకి సిద్ధమయ్యాడు. ప్రస్తుతం ఇతడు కన్నడలో ఓ సినిమాలో నటిస్తున్నాడు.