రష్మిక మందాన్న 'గీత గోవిందం' చిత్రంతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ విజయ్  దేవరకొండతో కలిసి 'డియర్ కామ్రేడ్' సినిమాలో నటిస్తోంది. భరత్ కమ్మ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో విజయ్ స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్నాడు. 

మే 31న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మికల మధ్య లిప్ లాక్ సన్నివేశం ఉంది. తెలుగు, తమిళ ప్రేక్షకుల నుండి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తున్నా.. కన్నడ ఆడియన్స్ మాత్రం ఈ టీజర్ చూసి ఫైర్ అవుతున్నారు.

సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు రష్మికపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'నీ లిప్ లాక్ కారణంగా నువ్వంటే అసహ్యమేస్తుందని' ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. అవకాశాల కోసం ఇంతగా దిగాజారలా అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. తాజాగా వీటిపై స్పందించింది రష్మిక.

ఏదైనా కథలో భాగంగా ఉంటేనే నటిస్తామని, కావాలని ముద్దు సీన్లలో నటించమని చెప్పింది. సినిమా చూస్తే ఈ లిప్ లాక్ సీన్లు తప్పుగా కనిపించవని వెల్లడించింది. అవకాశాల కోసం ఇలాంటి సన్నివేశాల్లో నటించాననే విషయంలో నిజం లేదని, ఇచ్చిన పాత్రకి న్యాయం చేశానని భావిస్తున్నట్లు తెలిపింది. ఇద్దరు ప్రేమికుల మధ్య సందర్భానికి తగ్గట్లుగా నటించామని వివరణ ఇచ్చింది.