ఐశ్వర్య రాజేష్ తన అభిప్రాయాలను వెల్లడించగా, వాటిని తప్పుగా అర్థం చేసుకున్నారంటూ ఆమె వివరణ ఇచ్చింది. వాస్తవంగా తానేమి మాట్లాడానన్న వివరణతో ఐశ్వర్య ఓ ప్రకటన విడుదల చేసింది


ఐశ్వర్య రాజేశ్.. ఇటీవలే పుష్ప చిత్రంలో రష్మిక మందన్నా గురించి చేసిన కామెంట్లు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. పుష్ప చిత్రంలో తను శ్రీవల్లీ పాత్రలో ఇంకా బాగా చేసేదాన్నని, ఆ క్యారెక్టర్ తనకు ఇంకా బాగా నప్పేదని ఐశ్వర్య వ్యాఖ్యానించడంతో అవి సర్వత్రా సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.ఈ కామెంట్స్ పై రష్మిక స్పందించింది. 

పుష్ప సినిమాలో రష్మిక చేసిన శ్రీవల్లి పాత్ర విషయంలో ఐశ్వర్య రాజేష్ తన అభిప్రాయాలను వెల్లడించగా, వాటిని తప్పుగా అర్థం చేసుకున్నారంటూ ఆమె వివరణ ఇచ్చింది. వాస్తవంగా తానేమి మాట్లాడానన్న వివరణతో ఐశ్వర్య ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ పాత్రలో రష్మిక కంటే తాను ఏ విధంగానూ మెరుగ్గా ఉండనని ఐశ్వర్య రాజేష్ స్పష్టం చేసింది. కాకపోతే అలాంటి పాత్ర తనకు నప్పుతుందని చెప్పానంటూ స్పష్టం చేసింది. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నట్టు పేర్కొంది. రష్మిక పాత్ర పట్ల తనకు ఎంతో అభిమానం తప్పించి మరోటి లేదన్నారు. 

Scroll to load tweet…

‘‘ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ‘తెలుగు సినిమాలో ఎలాంటి పాత్రలు చేయాలని అనుకుంటున్నారు?’ అని నన్ను ప్రశ్నించారు. తెలుగు పరిశ్రమ అంటే నాకు ఎంతో ఇష్టమని చెప్పా. నాకు నచ్చే పాత్రలు వస్తే తప్పకుండా చేస్తానన్నాను. పుష్ప సినిమాలో శ్రీవల్లి తరహా పాత్ర అంటే తనకు ఎంతో ఇష్టమని, అలాంటి పాత్రలు తనకు సరిపోతాయని ఉదాహరణగా చెప్పాను. కానీ నా మాటలను వక్రీకరించి వేరే అర్థం వచ్చేలా రాశారు. సదరు సినిమాలో రష్మిక చేసిన అద్భుతమైన నటనను నేనేదో కించపరిచినట్టు చూపించారు’’ అంటూ ఐశ్వర్య రాజేష్ వివరణ ఇచ్చింది.

రష్మిక మందన్న స్పందిస్తూ.. ‘‘హాయ్ లవ్.. నీవు ఏం చెప్పావో నేను సరిగ్గానే అర్థం చేసుకున్నాను. మనకు మనం వివరణ ఇచ్చుకోవడానికి ఎలాంటి కారణాలు లేవు. నీవంటే నాకు ప్రేమ, గౌవరం ఉన్నాయనేది నీకు తెలుసు’’ అని రష్మిక పేర్కొంది.

ఐశ్వర్య రాజేష్ ఫర్హానా సినిమా చేసింది. ఇది ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి నెల్సన్ వెంకటేషన్ దర్శకత్వం వహించారు. సెల్వరాఘవన్, జితన్ రమేష్, అనుమోల్, ఐశ్వర్య దత్తా తదితరులు కీలక పాత్రలు పోషించారు. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్ ప్రభు నిర్మాతలుగా వ్యవహరించారు.