ఇది టైమ్ ట్రావెల్ కి సంబందించిన కథ . సూపర్ నేచురల్ ఉండకపోవచ్చు కానీ, ఫాంటసీ వుంది అని చెప్పాడు దర్శకుడు. 


ఓటిటి మార్కెట్ దెబ్బతినటం, ప్రొడక్షన్ ఖర్చులు విపరీతంగా పెరిగిపోవటంతో రెండింటికి మధ్య బాలెన్స్ కుదరక చాలా సినిమాలు అండర్ ప్రొడక్షన్ స్దాయిలోనే ఆగిపోతున్నాయి. నిర్మాతలు అన్ని లెక్కలు వేసుకుని సినిమాని ఏదో విధంగా ముందుకు తీసుకుని వెళ్ళి పూర్తి చేసి నష్టపోవటం కన్నా ఆపేయటం మంచిదనే నిర్ణయానికి వస్తున్నారు. ఈ ట్రెండ్ తమిళ,మళయాళ ,తెలుగులో మొదలైంది. అలా ఆగిపోతున్న సినిమాల్లో రష్మిక కొత్త చిత్రం కూడా ఒకటుందనే వార్తలు వస్తున్నాయి.

తమిళ సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ... నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో తొలి ఫిమేల్ సెంట్రిక్ మూవీ ‘రెయిన్ బో’ గత ఏప్రిల్ లో చాలా ఎక్సపెక్టేషన్స్ తో ప్రారంభమైంది. ఖాకీ’, ‘ఖైదీ’, ‘సుల్తాన్’, ‘ఒకే ఒక జీవితం’ లాంటి సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ తన 2వ తెలుగు ప్రాజెక్టును మొదలు పెట్టింది. విలక్షన కథాంశాలు, చక్కటి నిర్మాణ విలువలకు పెట్టింది పేరైన ఈ సంస్థ 'రెయిన్‌ బో' పేరుతో కొత్త సినిమాను నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. ఇది టైమ్ ట్రావెల్ కి సంబందించిన కథ అని కూడా తెలిసింది. సూపర్ నేచురల్ ఉండకపోవచ్చు కానీ, ఫాంటసీ వుంది అని చెప్పాడు దర్శకుడు. దాంతో ఈ సినిమాకు బాగానే బజ్ క్రియేట్ అయ్యింది.

అయితే 15 నుంచి 20 రోజుల షూటింగ్ తర్వాత ఈ సినిమాని ఆపేసారని చెన్నై వర్గాలు వెల్లడిస్తున్నాయి. అందుకు కారణం తమిళంలో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అసలు వర్కవుట్ కాకపోవటమే అంటున్నారు. దీంతో నిర్మాతలు ఈ సినిమా నిర్మాణాన్ని ప్రస్తుతానికి నిలిపి వేశారని.. తిరిగి సినిమా ప్రారంబిస్తారా లేదా అన్నది అనుమానమే అని, ప్రారంభించినా బడ్జెట్ నుంచిఅన్నీ పూర్తిగా మార్చేసి కొత్త లెక్కలతో ముందుకు వెళ్తారని అంటున్నారు. ఈ క్రమంలో రష్మికని రెమ్యునరేషన్ తగ్గించుకోమని కూడా అడిగారని ఆమె కు పెరుగుతున్న పాపులారిటీ కారణంగా తగ్గేదేలే అని చెప్పినట్లు సమాచారం. తన యానిమల్ ,పుష్ప సినిమాలతో ఈ సినిమా బిజినెస్ అన్ని భాషల్లోనూ బాగా చేస్తారని, అలాంటప్పుడు తనకు ఇచ్చేది ఎక్కువ రెమ్యూనరేషన్ కాదని ఆమె వాదనగా చెప్తున్నారు. అయితే ఈ వార్తల్లో ఎంతవరకూ నిజం ఉందో కానీ ప్రస్తుతానికి సినిమా షూటింగ్ అయితే జరగటం లేదు.

డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పై SR ప్రకాష్ బాబు, SR ప్రభు ఈ బ్రీజీ రొమాంటిక్ ఫాంటసీ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. 'రెయిన్‌బో' అన్ని వయసుల ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ అనుభూతిని కలిగిస్తుందని వెల్లడించారు. నూతన దర్శకుడు శాంతరూబన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నటుడు దేవ్ మోహన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. KM. జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందించగా, భాస్కరన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇక ఈసినిమాకు ఎడిటర్ గా ఇ. సంగతమిజన్ వ్యవహరిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్ గా వినీష్ బంగ్లాన్, ఆర్ట్ డైరెక్టర్ గా సుబెంథర్ పిఎల్ పని చేస్తున్నారు. క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా తంగప్రభాకరన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా అరవేంద్రరాజ్ బాస్కరన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.