చిరంజీవి కోడలు, రామ్‌చరణ్‌ భార్య ఉపాసన కామినేని ప్రతి ఆదివారం `యువర్‌ లైఫ్‌` పేరుతో వెబ్‌ పోర్టల్‌ని రన్‌ చేస్తున్న విషయం తెలిసిందే. సమంత గెస్ట్ ఎడిటర్‌గా దీన్ని రన్‌ చేస్తున్నారు. మొదట్లో ఆమె సహజమైన వంటలు చేసి ఆకట్టుకున్నారు. తాజాగా రష్మిక సందడి చేస్తుంది. గత రెండు వారాలుగా రష్మిక తనదైన కొత్త వంటకాలను పరిచయం చేస్తుంది. హెల్గీ ఫుడ్‌పై అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది. 

తాజాగా స‌మంత స్థానంలో టాలీవుడ్‌ క్రేజీ హీరోయిన్‌ రష్మిక మందన్నాని గెస్ట్ ఎడిటర్‌గా ఉపాసన సెలెక్ట్ చేసింది. హెల్దీ ఫుడ్‌లో భాగంగా ఈ ఆదివారం చికెన్‌తో కోలిపట్టు కూర వండి ఉపాసనకి రుచి చూపించింది. కోలిపుట్టు కూరని రుచిచూసిన ఉపాసన రష్మికకి వంద మార్కులేయండం విశేషం.  రష్మిక సూపర్‌ చెఫ్‌ అని ప్రశంసించింది. రష్మికకు ఎవరైనా చెఫ్‌గా అవకాశం ఇస్తే సూపర్‌ వంట చేస్తుందని ప్రశంసలతో ముంచెత్తింది ఉపాసన.

 ప్రస్తుతం ఈ వీడియోని సోషల్‌ మీడియా ద్వారా పంచుకోగా, ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌ అవుతుంది. ఈ సమయంలో వీరిద్దరి మధ్య చోటు చేసుకున్న సరదా సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. రష్మిక ప్రస్తుతం `పుష్ప`, `ఆడాళ్లు మీకు జోహార్లు`తోపాటు కన్నడలో `పోగరు`, తమిళంలో `సుల్తాన్‌` చిత్రంలో నటిస్తుంది.