Asianet News TeluguAsianet News Telugu

బంపర్ ఆఫర్ కొట్టేసిన రష్మిక మందన్నా, విక్రమార్కుడు సీక్వెల్ లో కన్నడ భామ

బంపర్ ఆఫర్ కొట్టేసింది కన్నడ సోయగం రష్మిక మందన్నా. టాలీవుడ్ తో పాటు.. బాలీవుడ్ లో కూడా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్న ఈ బ్యూటీకి భారీ లాటరీ తగిలింది. 

Rashmika Mandanna In Vikramarkudu Bollywood Sequel with Shahid Kapoor JMS
Author
First Published Jun 2, 2023, 9:07 AM IST | Last Updated Jun 2, 2023, 9:15 AM IST


టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా మంచి మంచి అవకాశాలు సాధిస్తోంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ సాధించిన కన్నడ సోయగం పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ కొట్టేసింది. ఇక పుష్ప2రిలీజ్ అయితే.. ఆమెకు డిమాండ్  ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక తాజాగా రష్మిక బాలీవుడ్ లో బంపర్ ఆఫర్ కొట్టేసినట్టు తెలుస్తోంది. 
 
తెలుగుతో పాటు హిందీ చిత్రసీమలో కూడా భారీ అవకాశాలతో దూసుకుపోతున్నది  రష్మిక. తెలుగులో  రవితేజ హీరోగా.. రాజమౌళి డైరెక్ట్ చేసిన విక్రమార్కులు సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో తెలిసిందే. ఈసినిమాను హిందీలో రౌడీ రాథోడ్  పేరుతో రీమేక్‌ చేసిన విషయం కూడా తెలిసిందే. అక్షయ్‌కుమార్‌ హీరోగా నటించిన ఈ  సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసి వదిలిపెట్టింది.  సంచలన విజయం నమోదు చేసింది. ఇక తాజాగా ఈ సినిమాకు బాలీవుడ్ లో  సీక్వెల్‌ చేసేందుకు  న్నాహాలు చేస్తున్నారు.

తెలుగులో విక్రమార్కుడు సినిమాకు సీక్వెల్ రాలేదు కాని.. హిందీలో మాత్రం భారీస్థాయిలో సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నారు. ఇందులో హీరోగా  షాహిద్‌ కపూర్‌ నటించనుండగా ప్రభుదేవా దర్శకత్వం వహించబోతున్నారు. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ సంజయ్‌లీలా భన్సాలీ నిర్మాతగా బాధ్యతలు తీసుకుంటున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్నను హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.  ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్‌మీదకు వెళ్లనుందని తెలిసింది. 

ప్రభుదేవ డైరెక్టర్  చేసిన సినిమాలన్నీ దాదాపు హట్ అయ్యాయి. ఈసినిమా కూడా పక్కా ప్లానింగ్ తో ఆయన తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రష్మిక మందన్న హిందీలో రణ్‌బీర్‌కపూర్‌ సరసన యానిమల్‌ సినిమాలో నటిస్తోంది. ఈసినిమాను అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈసినిమాను వరల్డ్ వైడ్ గా  ఆగస్ట్‌ 11న రిలీజ్ చేయబోతున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios