Asianet News TeluguAsianet News Telugu

రష్మిక మందన్న-దుల్కర్ సల్మాన్ ‘సీతారామం’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న నటించిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘సీతా రామం’ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. ఈ చిత్రంలో మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్‌ నటిస్తున్నారు. 
 

Rashmika Mandanna Dulquer Salman Movie Sita Ramam Movie Release Date Fix, When?
Author
Hyderabad, First Published May 25, 2022, 6:31 PM IST

మలయాళం స్టార్ దుల్కర్ సల్మాన్, రష్మిక మందన్న మరియు  మృణాల్ ఠాకూర్‌లు కలిసి నటించిన రొమాంటిక్ చిత్రం ‘సీతా రామం : యుద్ధంతో రాసిన ప్రేమ కథ’. ఈ మూవీ కోసం దక్షణాది ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ డ్రామా యుద్ధ నేపథ్యానికి వ్యతిరేకంగా తెరకెక్కుతోంది. దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) సైనికుడి పాత్రలో కనిపించనున్నాడు. మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్ గా నటించింది. వీరి ఇద్దరి మధ్య సాగే ప్రేమ కథగా సినిమా ఉండనుంది.  సీతా రామంలో రష్మిక మందన్న (Rashmika Madanna) కీలకమైన అఫ్రీన్ పాత్రను పోషించింది.

కాగా, ఈ చిత్రం నుంచి తాజాగా బిగ్ అప్డేట్ అందింది. ‘సీతారామం’ చిత్రాన్ని రిలీజ్ సిద్ధం చేసినట్టు మేకర్స్. ఈ సందర్భంగా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. తెలుగు, తమిళం, మలయాళం భాషలో ఆగస్టు 5న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇటీవలె ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగ్ ‘ఓహ్ సీతా హే రామా’ అనే టైటిల్ సాంత్ రిలీజ్ అయ్యి ఆడియెన్స్ నుంచి మంచి స్పందనను పొందుతోంది.

గతంలో రిలీజ్ అయిన గ్లింప్స్, పోస్టర్స్ కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. మున్ముందు సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కూడా రానున్నాయి. స్వప్న సినిమా బ్యానర్‌పై అశ్వినీదత్, ప్రియాంక దత్ సమర్పణలో వైజయంతి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సీతా రామంలో సుమంత్, గౌతమ్ మీనన్ మరియు ప్రకాష్ రాజ్ ద్వితీయ పాత్రలు చేయనున్నారు. పిఎస్ వినోద్ కెమెరా వర్క్ అందించనున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.

అయితే, రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సందర్భంగా దుల్కర్ సల్మాన్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఇలా రాశాడు. ‘ఒక పురాణ కథ. మనం కలలోకి అడుగుపెట్టినట్లు అనిపించిన చిత్రం. రంగులు, దృశ్యాలు మరియు శబ్దాలతో కూడిన అద్భుతమైన యుగానికి ప్రయాణిస్తున్న సమయం. ఇది చరిత్ర పేజీల నుండి పుట్టిన ప్రేమ లేఖ. మీకు సమీపంలోని థియేటర్‌లకు త్వరలో ‘సీతారామం’ రాబోతోంది’ అంటూ సినిమాను వివరించే ప్రయత్నం చేశాడు.   

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Dulquer Salmaan (@dqsalmaan)

Follow Us:
Download App:
  • android
  • ios