'గీత గోవిందం' క్రేజ్ తో రెమ్యునరేషన్ డబుల్ చేసిందట!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 20, Aug 2018, 11:20 AM IST
rashmika mandanna doubles her remuneration
Highlights

 'గీత గోవిందం' రిలీజ్ కి ముందు అంగీకరించిన 'దేవదాస్','డియర్ కామ్రేడ్' సినిమాలకు కూడా ఆమె రెమ్యునరేషన్ పెంచి ఇవ్వమని నిర్మాతలకు చెప్పేసిందట. 

'ఛలో' చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకుంది. రీసెంట్ గా 'గీత గోవిందం' చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు రష్మికకు టాలీవుడ్ లో వరుస అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఈ క్రేజ్ ని వాడుకోవాలని ఫిక్స్ అయింది రష్మిక. 'గీత గోవిందం' ఇచ్చిన సక్సెస్ తో తన రెమ్యునరేషన్ ని డబుల్ చేసేసిందట.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఆమె దాదాపు అరకోటి పారితోషికం డిమాండ్ చేస్తుందని తెలుస్తోంది. 'గీత గోవిందం' రిలీజ్ కి ముందు అంగీకరించిన 'దేవదాస్','డియర్ కామ్రేడ్' సినిమాలకు కూడా ఆమె రెమ్యునరేషన్ పెంచి ఇవ్వమని నిర్మాతలకు చెప్పేసిందట.

మేకర్స్ కూడా ఆమె అడిగినంత ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. టాలీవుడ్ లో వస్తోన్న అవకాశాలతో రష్మిక కొంతకాలం పాటు కన్నడ ఇండస్ట్రీ నుండి బ్రేక్ తీసుకోనుందని అంటున్నారు. మొత్తానికి టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదగడానికి రష్మిక బాగానే ప్రయత్నిస్తోంది. 

loader