సినిమా ఇండస్ట్రీలో రూమర్లు అనేవి కామన్. ఇద్దరు హీరో, హీరోయిన్స్ కలిసి రిపీటెడ్ గా సినిమాలు చేస్తుంటే వారి మధ్య ఏదో ఉందంటూ వార్తలు పుట్టుకొస్తాయి. ఇక ఇద్దరూ కలిసి బయట కనిపిస్తే అంతే.. గాసిప్స్ కి ఎండ్ కార్డ్ ఉండదు. విజయ్ దేవరకొండ, రష్మికల విషయంలో కూడా ఇదే జరిగింది.

ఇద్దరూ కలిసి 'గీత గోవిందం', డియర్ కామ్రేడ్' సినిమాలు చేశారు. 'గీత గోవిందం' సినిమా దగ్గర నుండి ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ కథనాలు పుట్టుకొచ్చాయి. విజయ్ దేవరకొండ కారణంగానే రష్మిక తన ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకుందని కూడా రాశారు. కన్నడనాట ఈ వార్తలు మరింత బలంగా వినిపించాయి.

ఇద్దరూ కలిసి ఒకే హోటల్ లో ఉంటున్నారని, విజయ్ ఎక్కడకి వెళితే అతడితో పాటు రష్మిక కూడా వెళ్తుందని ఇలా చాలా వార్తలు వినిపించాయి. గతంలో ఈ వార్తలపై  స్పందించిన విజయ్ అలాంటిదేమీ లేదని చెప్పారు. తాజాగా రష్మికకు కూడా ఇదే ప్రశ్న ఎదురైంది. 

విజయ్ తో డేటింగ్ లో ఉన్నారా..? అని రష్మికని ప్రశ్నించగా.. 'అతడు నాకు కేవలం స్నేహితుడు మాత్రమే.. దానికి మించి మా మధ్య ఏమీలేదు' అంటూ క్లారిటీ ఇచ్చింది. కనీసం ఇప్పటికైనా ఈ రూమర్లకు ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి. ప్రస్తుతం రష్మిక.. మహేష్ కి జోడీగా 'సరిలేరు నీకెవ్వరు', నితిన్ కి జోడీగా 'భీష్మ' చిత్రాల్లో నటిస్తోంది.