నిజం చేస్తే పోలే.. పారితోషికం పెంచిందనే వార్తలపై రష్మిక మందన్నా క్రేజీ కౌంటర్.. మామూలు సెటైర్లు కాదు..
రష్మిక మందన్నా ఇటీవల `యానిమల్` మూవీతో బ్లాక్ బస్టర్ అందుకుని హాట్ కేక్ లా మారింది. ఈ నేపథ్యంలో రెమ్యూనరేషన్‌పెంచిందంటూ వార్తలు స్టార్ట్ అయ్యాయి. దీనిపై రష్మిక అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది.

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. ప్రస్తుతం తెలుగులో బిజీయెస్ట్ హీరోయిన్‌గా, స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుంది. అంతేకాదు టాప్ పాన్ ఇండియా హీరోయిన్‌గా పేరుతెచ్చుకుంది. `యానిమల్` మూవీ అమ్మడి కెరీర్‌ని అమాంతం పెంచేసింది. ఓ వైపు `పుష్ప`, మరోవైపు `యానిమల్` పడటంతో రష్మిక రేంజ్ బాగా పెరిగిపోయింది. కానీ యాటిట్యూట్ పరంగా డౌన్ టూ ఎర్త్ ఉంటుంది రష్మిక. అదే ఆమె ప్రత్యేకత.
ఇదిలా ఉంటే `యానిమల్` విజయంతో ఈ అమ్మడు భారీగా పారితోషికం పెంచిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అంతకు ముందు సినిమాకి మూడు కోట్లు తీసుకునే రష్మిక మందన్నా, ఇప్పుడు నాలుగు కోట్లు, నాలుగున్నర కోట్లు అడుగుతుందని అంటున్నారు. ప్రస్తుతం ఈవార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ బ్యూటీ స్పందించింది. సోషల్ మీడియాలో పోస్ట్ కి ఆమె రిప్లై ఇస్తూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
ఆమె రియాక్ట్ అవుతూ, ఎవరు చెప్పారు ఈ విషయం, నేను ఆశ్చర్యపోతున్నాను. ఇవన్నీ చూసిన తర్వాత నేను నిజంగానే ఆలోచించాలని అనుకుంటున్నా. ఈ విషయాన్ని నిర్మాతలు ముందు ఉంచితే ఎందుకు అని అడుగుతున్నారు. అప్పుడు నేను మీడియా అలా చెబుతోంది సార్, నేఉన కూడా వారి మాటలకు కట్టుబడి ఉండాలని అనుకుంటున్నా. మరి ఏం చేయాలి?` అంటూ కాస్త ఫన్నీగా, ఇంకాస్త క్రేజీగా రియాక్ట్ అయ్యింది రష్మిక.
ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై నిర్మాత ఎస్‌కేఎన్ కూడా రియాక్ట్ అయ్యాడు. లక్కీగా మా గర్ల్ ఫ్రెండ్ మూవీ తర్వాత ఈ వార్త వచ్చిందని సెటైరికల్‌గా ఆయన పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ నెట్టింట రచ్చ చేస్తుంది. ఇక ప్రస్తుతం రష్మిక మందన్నా `పుష్ప 2`లో నటిస్తుంది. ఇది ఆగస్ట్ లో రాబోతుంది. అలాగే `ది గర్ల్ ఫ్రెండ్` అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తుంది. దీంతోపాటు `రెయిన్‌బో` అనే సినిమా కూడా చేస్తుంది. అలాగే హిందీలో ఓ మూవీ, తమిళంలో ధనుష్, నాగార్జున మూవీలో నటిస్తుంది. కన్నడలోనూ ఆమె పేరు వినిపిస్తుంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
Read more: Rashmika Mandanna : రెమ్యునరేషన్ పెంచేసిన రష్మిక మందన్న.. సినిమాకి ఎంత చెబుతోందంటే?
Also read: అందుకే పిల్లల్ని కనడం ఆలస్యం అయ్యింది... ఉపాసన కామెంట్స్ వైరల్