ఇళయ థళపతి విజయ్‌తో రష్మిక మందన్నా జోడి కట్టబోతుందని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలను కన్ఫమ్ చేసింది యూనిట్. ఆమె బర్త్ డే సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించారు.
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) ఇటు సౌత్‌లో, అటు నార్త్ లో దూసుకుపోతుంది. ఆమె వరుసగా భారీ సినిమాలను దక్కించుకుంటూ తన సత్తాని చాటుకుంటుంది. `పుష్ప`(Pushpa) చిత్రంతో నేషనల్ వైడ్‌గా ఫాలోయింగ్‌ని పెంచుకున్న రష్మిక మందన్నా నేడు(ఏప్రిల్ 5)న పుట్టిన రోజు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఆమెకి సంబంధించి బ్యాక్ టూ బ్యాక్ కొత్త ప్రాజెక్ట్ ల అనౌన్స్ మెంట్స్ వస్తుండటం విశేషం.
చాలా కాలంగా కోలీవుడ్ స్టార్ థళపతి విజయ్(Vijay)తో జోడీ కట్టబోతుందనే టాక్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దీన్ని కన్ఫమ్ చేసింది యూనిట్. విజయ్‌తో తెలుగు డైరెక్టర్ వంశీపైడిపల్లి రూపొందిస్తున్న తెలుగు, తమిళం బైలింగ్వల్ మూవీ `vijay 66` లో రష్మిక మందన్నాని హీరోయిన్‌గా ఖరారు చేశారు. ఆమెని ప్రాజెక్ట్ లోకి ఆహ్వానిస్తూ బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ సినిమాతో విజయ్ తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
మరో తెలుగు కొత్త సినిమా అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. `మహానటి` ఫేమ్ దుల్కర్ సల్మాన్ తెలుగులో ఓ సినిమా చేస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా రష్మికనే హీరోయిన్‌గా ఖరారు చేశారు. వార్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో దుల్కర్‌కి జోడీగా అఫ్రీన్ పాత్రలో రష్మిక మందన్నా నటించబోతుంది. తాజాగా ఈ చిత్రంలోని ఆమె ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది యూనిట్. రష్మిక లుక్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

మరోవైపు కొత్తగా హిందీలో రణ్‌బీర్ కపూర్‌తో `యానిమల్` సినిమా చేస్తుంది. ఇటీవలే చిత్ర దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు. హీరోయిన్‌గా రష్మికని ఆహ్వానించారు. మరోవైపు హిందీలో `మిషన్ మజ్ను`, `గుడ్‌బై` సినిమాలు చేస్తుంది రష్మిక. అలాగే తెలుగులో `పుష్ప`కి రెండో పార్ట్ గా రాబోతున్న `పుష్ప 2`లోనూ ఆమె హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇలా తెలుగు, తమిళం, హిందీలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతుందీ నేషనల్ క్రష్.
