'ఛలో' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన రష్మిక మందాన్న తాజాగా 'గీత గోవిందం' సినిమాతో మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఆమె 'దేవదాస్','డియర్ కామ్రేడ్' వంటి సినిమాల్లో నటిస్తోంది. అయితే గత కొద్దిరోజులుగా రష్మిక తన నిశ్చితార్దాన్ని రద్దు చేసుకుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

తన సహా నటుడు రక్షిత్ ని ప్రేమించి అతడితో నిశ్చితార్ధం చేసుకుంది రష్మిక. సినిమాల పరంగా బిజీగా ఉన్న ఆమె తన ఎంగేజ్మెంట్ ని బ్రేక్ చేసుకుందని ప్రముఖ ఆంగ్ల పత్రిక ప్రచురించడంతో ఆ వార్తలపై ఆమె స్పందించి అందులో నిజం లేదని చెప్పింది. తాజాగా మరో ఆంగ్ల పత్రిక రష్మిక-రక్షిత్ ల నిశ్చితార్ధం రద్దయిందంటూ ఓ కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుతం ఆమె తన కెరీర్ పై దృష్టి పెట్టిందని ఆ కారణంతోనే నిశ్చితార్దాన్ని క్యాన్సిల్ చేసుకుందని..

రష్మిక సన్నిహితులు ఏఈ విషయాన్ని వెల్లడించినట్లు సదరు పత్రిక పేర్కొంది. ఇది కఠిన నిర్ణయమే అయినప్పటికీ కెరీర్ కోసం ధైర్యం చేసిందని, తల్లితండ్రులతో మాట్లాడి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుందని రాసుకొచ్చారు. అయితే ఈ విషయాలపై మాత్రం రష్మిక ఇంకా ఎలాంటి వివరణ ఇవ్వలేదు.