టాలీవుడ్‌ క్రేజీ బ్యూటీ రష్మిక మందన్నా నేడు తన 25వ పుట్టిన రోజుని జరుపుకుంటోంది. `ఛలో` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే అందరిని ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత `గీతగోవిందం`తో స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. `దేవదాస్‌`, `డియర్‌ కామ్రేడ్‌` చిత్రాలతో ఆకట్టుకుంది. `సరిలేరు నీకెవ్వరు`, `భీష్మ` చిత్రాలతో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ప్రస్తుతం ఈ ఎనర్జిటిక్‌ బ్యూటీ అల్లు అర్జున్‌తో `పుష్ప` చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్‌, విలన్‌, ఫస్ట్ గ్లింప్స్ వచ్చాయి. త్వరలోనే పుష్పరాజ్‌ పాత్రని పరిచయం చేయబోతున్నారు. 

కానీ పుష్ప` విషయంలో రష్మిక మందన్నాకి అన్యాయం జరుగుతుందనే టాక్‌ వినిపిస్తుంది. ఎందుకంటే నేడు(సోమవారం) రష్మిక బర్త్ డే. ఈ సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్‌ని విడుల చేస్తుంటారు. కానీ కేవలం విషెస్‌ చెప్పి సరిపెట్టుకుంది సుకుమార్‌ టీమ్‌. దీంతో రష్మిక ఫ్యాన్స్ డిజప్పాయింట్‌ అవుతున్నారట. ఆమె నటిస్తున్న మరో తెలుగు సినిమా `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రం ఆమె ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది. ఓ పార్క్ లో బంతిపూల దండ కూర్చుతూ చీరకట్టులో రష్మిక ఎంతో అందంగా ఉంది. శర్వానంద్‌ హీరోగా కిషోర్‌ తిరుమల ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఆమె లుక్‌ రావడంతో `పుష్ప` యూనిట్‌పై ఒత్తిడి పెంచుతున్నారు రష్మిక ఫ్యాన్స్ . మరి స్పందిస్తారో లేదో చూడాలి. 

రష్మిక తమిళంలో నటించిన `సుల్తాన్‌` చిత్రం ఇటీవల విడుదలై మిశ్రమ స్పందనని తెచ్చుకుంటోంది. మరోవైపు ఈ అమ్మడు హిందీలోకి ఎంట్రీ ఇస్తూ `మిషన్‌మజ్ను`, అమితాబ్‌తో ఓ సినిమా చేస్తుంది. దీనికి `గుడ్‌బై` అనే టైటిల్‌ని అనుకుంటున్నారట.