విజయ్ దేవరకొండ నటిస్తున్న డియర్ కామ్రేడ్ చిత్రానికి భరత్ కమ్మ దర్శకుడు. ఇటీవల విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోసారి విజయ్ దేవరకొండ తన ప్రత్యేకమైన మేనరిజమ్స్ తో మాయచేసేలా కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో రష్మిక, విజయ్ మధ్య రొమాన్స్ మరోసారి యువతని ఆకర్షించేలా కనిపిస్తోంది. 

తాజాగా రష్మిక ఓ ఇంటర్వ్యూలో డియర్ కామ్రేడ్ చిత్రంలోని ముద్దు ముచ్చట్ల గురించి వివరించింది. విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య ఎక్కువగా లిప్ లాక్ సీన్స్ కనిపిస్తున్నాయి. నిజంగానే ముద్దులు పెట్టుకున్నారా లేక కెమెరా ట్రిక్కా అని ప్రశ్నించగా.. అది టాప్ సీక్రెట్.. అవన్నీ చెప్పేయకూడదు అని రష్మిక నవ్వుతూ సమాధానం ఇచ్చింది. 

ఈ కాలం ప్రేక్షకులకు ముద్దు సన్నివేశాల్లో పొదలు.. పూవులు ఊపడం చూపిస్తే ఒప్పుకోరు అని సరదాగా సమాధానం ఇచ్చింది. విజయ్ దేవరకొండ సినిమా అనగానే రష్మిక కథ వినకుండా ఒప్పేసుకుంది అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి సమాధానం ఇస్తూ అంత సీన్ లేదు.. కథ విన్నా.. నచ్చాకే ఒప్పుకున్నా అని రష్మిక సమాధానం ఇచ్చింది.