'ఛలో'  సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ఆ తర్వాత పొలో మంటూ ఆఫర్స్ ఆమె వెంటబడ్డాయి. ఇక గీత గోవిందం సినిమా తర్వాత అయితే ఆమెతో చేయాలని ప్రతీ  హీరో, డైరక్టర్స్  ఉత్సాహపడుతున్నారు. ఆమె డేట్స్ కోసం వెంటబడుతున్నారు .  ప్రస్తుతం విజయ్ దేవరకొండతో డియర్ కామ్రేడ్ చేస్తోంది.  ఈ సినిమాతో పాటు తెలుగులో మహేష్ బాబు, అల్లు అర్జున్, నితిన్, అఖిల్, కార్తీ సినిమాలు కమిటై బిజీగా మారింది.  

అయితే ఊహించని విధంగా  ఈ లక్కీ బ్యూటీకి బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. బాలీవుడ్ భారీ చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి ఓ సినిమాను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాడు.  ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మికను తీసుకోవాలని అనుకున్నారట.  ఆమెతో ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. అయితే సంజయ్ లీలా భన్సాలీకి హీరోయిన్ రష్మిక మందన షాక్ ఇచ్చింది. ఆయన సినిమాలో నటించేందుకు వచ్చిన ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించింది. బాలీవుడ్ నటుడు రణ్ దీప్ హుడాతో భన్సాలీ ఓ సినిమాను చేస్తున్నారు.

ఈ సినిమాలో ఓ పాత్ర కోసం ఆడిషన్ కు రష్మిక హాజరయింది. కానీ సినిమాలో తన క్యారక్టర్ లెంగ్త్ తక్కువగా ఉండటం, పెద్దగా ప్రాముఖ్యత లేకపోవటంపై రష్మిక అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ కారణంగానే భన్సాలీ తెరకెక్కిస్తున్న సినిమా నుంచి రష్మిక తప్పుకున్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. పెద్ద డైరక్టర్, పెద్ద సినిమా అయినా తనకు ప్రాముఖ్యత లేనివి ప్రక్కన పెట్టేస్తోంది. ఇలాంటి ఆఫర్   వేరే హీరోయిన్ అయితే ఎగిరి గంతేసి ఓకే చేసేసేదేమో కానీ రష్మిక మాత్రం ఆచి,తూచి అడుగులు వేస్తోంది. 

ప్రస్తుతం రష్మిక  నటిస్తున్న‘డియర్ కామ్రేడ్'  మే 31న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో లవ్, యాక్షన్ ఎంటర్టెనర్‌గా ప్రేక్షకులను అలరించబోతోంది.