అనతి కాలంలో స్టార్ హీరోయిన్ హోదా పట్టేసింది రష్మిక మందాన. ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందాన, గీతగోవిందం మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. లక్కీ లేడీగా వరుస విజయాలు తన ఖాతాలో వేసుకొని స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు పట్టేస్తుంది. మహేష్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ సరిలేరు నీకెవ్వరు మూవీలో హీరోయిన్ గా నటించిన రష్మిక, భీష్మ మూవీతో మరో హిట్ కొట్టారు. 

పుష్ప మూవీలో నటిస్తూ పాన్ ఇండియా ఆఫర్ కొట్టేసింది. సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్ర సెకండ్ షెడ్యూల్ మొదలు కావడం జరిగింది. అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా డీ గ్లామర్ రోల్ చేస్తుండగా సుకుమార్ రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. 

కాగా 2019-20 గానూ నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియాగా రష్మిక ఎంపికయ్యారు. నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా అని గూగుల్ లో సెర్చ్ చేస్తే రష్మిక పేరు చూపిస్తుంది. ఈ ఏడాది ఎక్కువ మంది నెటిజెన్స్ రష్మిక మందాన కోసం సెర్చ్ చేశారట. స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న రష్మిక మందాన మరో అరుదైన గౌరవం అందుకున్నారు.