ఇప్పుడీ పాత టాపిక్ ఎందుకూ అంటే.. పూజాకు ఇప్పుడు కోలీవుడ్‌లో బంపరాఫర్ వచ్చినట్లే వచ్చి చేజారిందని సమాచారం. విజయ్ హీరోగా దర్శకుడు నెల్సన్ డైరక్షన్ లో  ఓ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ.. ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి.  ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డేను ఫైనల్ చేసారు. తమిళం పరిశ్రమలో ఆఫర్ కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తోన్న పూజా.. ఈ అవకాశం వస్తూనే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. 

  8 సంవత్సరాల తరువాత కోలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వనుంది పూజా అని ప్యాన్స్ కూడా సంబరాలు చేసుకున్నారు. అయితే ఊహించని విధంగా ఇప్పుడు ఆమె ప్లేస్ లోకి రష్మిక వచ్చి చేరినట్లు తమిళ సినీ వర్గాల సమాచారం. అయితే ఎందుకు పూజని వద్దనుకున్నారనేది తెలియటం లేదు. మరో ప్రక్క ఈ సినిమాలో పూజ, రష్మిక ఇద్దరూ కూడా నటిస్తారంటూ ప్రచారం జరుగుతోంది..ఫిబ్రవరిలో ఈ చిత్రం షూటింగ్‌ని ఆరంభించాలనుకుంటున్నారు.


 ‘అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, అల వైకుంఠపురములో’ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలతో ఇక్కడ బిజీ అయ్యారు పూజ. ఇప్పుడు హిందీ చిత్రాలతోనూ బిజీగా ఉన్నారు. తాజాగా పూజాకు మరోసారి త్రివిక్రమ్‌ సినిమాలో మెరిసే అవకాశం వచ్చిందట. ప్రస్తుతం ఈ డైరెక్టర్‌ యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌తో సినిమా చేయనున్నాడు. ఇందులో ఎన్టీఆర్‌ సరసన పూజాను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. కాగా పూజా ఇప్పటికే త్రివిక్రమ్‌ అరవింద సమేత, అల వైకుంఠపురంలో సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం పూజా తెలుగులో ప్రభాస్‌తో ‘రాధే శ్యామ్‌ (ఈ చిత్రాన్ని హిందీలోనూ తెరకెక్కిస్తున్నారు), అఖిల్‌తో ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’, హిందీలో సల్మాన్‌ ఖాన్‌ తో ‘కభీ ఈద్‌ కభీ దీవాలి’, రణ్‌వీర్‌ సింగ్‌తో ‘సర్కస్‌’ చేస్తోంది.