కన్నడ చిత్రం ‘కిర్రిక్‌ పార్టీ’లో డీసెంట్‌ గాళ్‌గా రష్మిక మండన్నా నటించారు. ఇప్పుడు ఆమె చిల్లర దొంగతనాలు చేసే అమ్మాయిగా కనిపించనుంది. తమిళ చిత్రం ‘జిగర్‌దండా’లో హీరోయిన్ లక్ష్మీ మీనన్‌ చేసిన సరదా క్యారెక్టర్‌ ని ఆమె ఇప్పుడు తెలుగులో చేస్తోంది.  దర్శకుడు హరీష్ శంకర్ కావటంతో ఆమె క్రేజ్ ఓ రేంజిలో రెట్టింపు అవుతుందని భావిస్తున్నారు. గబ్బర్ సింగ్ లో శృతిహాసన్ ని గోల్డెన్ గర్ల్ గా మార్చినట్లే ఇప్పుడు రష్మికను స్టార్ హీరోయిన్ గా మార్చేస్తాడంటున్నారు. 

వరుణ్‌ తేజ్‌ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు హరీష్‌ శంకర్‌ ‘జిగర్‌దండా’ని తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. తెలుగు చిత్రంలో రష్మికను హీరోయిన్ గా తీసుకున్నారని సమాచారం. సినిమాలో ఆమె చేసే చిన్న చిన్న దొంగతనాలు ఫన్నీగా ఉంటాయట. 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై ఈ చిత్రం రూపొందనుంది. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. జనవరిలో రెగ్యులర్‌ షూటింగ్‌ ఆరంభం కానుంది. 

క‌న్న‌డ బ్యూటీ ర‌ష్మిక మండ‌న్నా తెలుగులో త‌న జోరు కొన‌సాగిస్తోంది. క‌న్న‌డ సినిమా `కిర్రాక్ పార్టీ`తో పాపుల‌ర్ అయిన ర‌ష్మిక తెలుగులో తొలి సినిమా `ఛ‌లో`తో ఘ‌న విజ‌యాన్ని అందుకుంది. ఈ సినిమా విజ‌యం సాధించ‌డంతో వెంట‌వెంట‌నే విజ‌య్ దేవ‌ర‌కొండ‌, నాని సినిమాల్లో చాన్సులు ద‌క్కించుకుంది. 

‘ఛలో’ తర్వాత  రష్మిక ఫుల్ బిజీ అయ్యంది. ‘గీత గోవిందం’సక్సెస్‌తో మరింత ఫామ్‌లోకి వచ్చారు. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ సరసన ‘డియర్‌  కామ్రేడ్‌’, నితిన్‌తో ఓ సినిమా, కన్నడంలో ఓ సినిమా చేస్తూ ఫుల్‌ జోష్‌లో ఉంది.