జబర్దస్త్ షో చూసేవారికి శాంతి స్వరూప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లేడీ గెటప్ వేసుకొని బుల్లితెరపై అతడు చేసే అల్లరి అంతాఇంతా కాదు. హైపర్ ఆది తన స్కిట్ లలో శాంతి స్వరూప్ కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంటాడు. 

అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ నెటిజన్ రష్మి.. శాంతి స్వరూప్ తో ఉన్న ఫోటోని పోస్ట్ చేస్తూ.. రష్మి నీకంటే శాంతి స్వరూప్ చాలా అందంగా ఉన్నాడు అంటూ ట్వీట్ చేశాడు. ఇది చూసిన రష్మి పాజిటివ్ గా స్పందిస్తూ.. ''అది నిజమే, మన చుట్టూ మనల్ని జడ్జ్ చేసే ప్రజలు ఎంతోమంది ఉన్నప్పుడు అలా నటించడం సులువేమీ కాదు. కాబట్టి నాకైతే వారిపై చాలా గౌరవం ఉంది'' అంటూ చెప్పుకొచ్చింది.

అలానే మరికొంతమంది నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చింది. ప్రస్తుతం రష్మి బుల్లితెర షోలతో చాలా బిజీగా గడుపుతోంది.