ఐటెమ్ గాళ్ గా అలరించేందుకు సిద్ధమయిన రష్మి ఇప్పటికే గుంటూరు టాకీస్ మూవీలో కుర్రాళ్లకు మత్తెక్కించిన రష్మి రాజ్ తరుణ్ మూవీలో ఐటెమ్ గాళ్ గా మత్తెక్కించేందుకు రష్మి రెడీ
జబర్దస్త్ మూవీ యాంకర్ గా తెలుగు ఆడియెన్స్ లో మాంచి ఫాలోయింగ్ ఉన్న హాట్ బ్యూటీ రష్మి. ఆ మధ్య గుంటూరు టాకీస్ మూవీలో తన హాట్ హాట్ ఎక్స్ ప్రెషన్స్ తో యూత్ కు పిచ్చెక్కిన భామ రష్మి. తన హాట్ సాంగ్ తో ఏకంగా అల్లు అర్జున్ రికార్డునే బద్ధలు కొట్టిన ఈ భామ ఇప్పుడు మరో మూవీలో ఐటమ్ గాళ్ గా మెస్మరైజ్ చేయనుంది.
సోలోగా మరో హిట్ కొట్టడానికి రాజ్ తరుణ్ రెడీ అవుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'కిట్టుగాడు వున్నాడు జాగ్రత్త' తెరకెక్కింది. వంశీకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ నెల చివరలో విడుదల చేయాలనుకుంటున్నారు.
అయితే తాజాగా ఈ సినిమా టీమ్, ఐటమ్ సాంగ్ ను జోడిస్తే బాగుంటుందనే ఆలోచన చేసిందట. రష్మీతో ఐటమ్ సాంగ్ చేయించాలనే ఉద్దేశంతో ఆమెను సంప్రదిస్తున్నారని తెలుస్తోంది. ఆమె ఓకే అంటే చకచకా ఏర్పాట్లు జరిగిపోతాయని అంటున్నారు. ఇటీవలే 'విన్నర్' సినిమాలో అనసూయ ఒక స్పెషల్ సాంగ్ చేసింది. కాబట్టి రష్మీ కూడా ఈ ఐటమ్ సాంగ్ లో దుమ్ము దులిపేస్తుందేమో చూడాలి.
