ప్రముఖ యాంకర్ రష్మి గౌతమ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంతో పాటు ఎవరైనా నెగెటివ్ గా కామెంట్ చేస్తే వారికి ధీటుగా బదులు కూడా ఇస్తుంటుంది. తాజాగా ట్విట్టర్ లో ఓ వ్యక్తి రష్మిని తన తండ్రి నెంబర్ కావాలని అడిగాడు.

ఓ యాడ్ షూట్ కోసం మిమ్మల్ని సంప్రదించాలని అనుకుంటున్నట్లు, మీ నాన్న నెంబర్ మిస్ అయిందని, ఒకసారి నెంబర్ పంపించాలని కోరాడు. ఇది చూసిన రష్మి షాక్  అయింది. ఎందుకంటే రష్మి చిన్నప్పుడే తన తండ్రిని కోల్పోయింది. 

ఇదే విషయాన్ని సదరు నెటిజన్ కి వివరిస్తూ.. ''నాకు పన్నెండేళ్ల వయసున్నప్పుడే నాన్న చనిపోయారు. కాబట్టి మా నాన్న నెంబర్ నీ దగ్గర ఉండే ఛాన్స్ లేదు. ఇలా పీఆర్ మేనేజ్మెంట్ పేరుతో ఇతరులను ఫూల్ చేయాలని ప్రయత్నించకు. అమ్మాయిలతో మాట్లాడడానికి ఇదొక వంక అని నాకు తెలుసు.

మీలాంటి వాళ్ల కారణంగా ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తోంది'' అంటూ సదరు నెటిజన్ పై ఫైర్ అయింది. అయితే రష్మి అభిమానులు మాత్రం ఇలాంటివిషయాలపై స్పందించకూడదని రష్మికి సలహాలు ఇస్తున్నారు. ఆమె మాత్రం స్పందించాల్సిన బాధ్యత తనపై ఉందని చెబుతోంది.