జబర్దస్త్ పోగ్రాం యాంకర్  రేష్మికు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. దాన్ని క్యాష్ చేసుకునేందుకా అన్నట్లు ఆమె అప్పుడప్పుడూ సినిమాలు చేస్తూంటుంది. అయితే రేష్మి చేసే సినిమాల కథలు ఆమె చుట్టూనే తిరుగుతూంటాయి. లో బడ్జెట్ లో చేసే ఆ చిత్రాలు ఎక్కువగా హారర్ బేసెడ్ గా ఉంటున్నాయి. అంతేకాక అక్కడక్కడా రష్మి హాట్ అందాలను ఆరబోస్తూంటాయి. ఇప్పుడు అలాంటిదే మరో సినిమా రెడీ అవుతోంది.

రష్మీ గౌతమ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం టైటిల్ ‘శివరంజని’. నాగ ప్రభాకర్‌  దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ని .... ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్‌  బుధవారం విడుదల చేశారు.  రష్మి ఫ్యాన్స్ ని సంతృప్తిపరిచేందుకు నందుతో హాట్ హాట్  గా... ‘ఇంకా కొత్త కొత్త టేస్ట్‌లు చాలా చూపిస్తా బావా’ అంటూ ఓ డైలాగుని వదిలారు. ఈ ట్రైలర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

‘ఈ ఇంట్లో ఓ హత్య జరిగింది. కానీ చంపింది నేను కాదు. నువ్వు..’ అంటూ ఓ పోలీసు అధికారి నందుతో చెబుతున్న డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలై ఇంట్రస్టింగ్ సాగింది.  ఈ సినిమాలో రేష్మిని ఓ దెయ్యం హాంట్ చేస్తూంటుంది. ఈ లోగా రష్మి తన గతాన్ని మర్చిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది అన్నదే కథ. ట్రైలర్‌లో ధన్‌రాజ్‌ చేసిన ఫన్ బాగుంది.  శేఖర్‌ చంద్ర సంగీతం అందించిన ఈ చిత్రం త్వరలో  ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.