Asianet News TeluguAsianet News Telugu

మానవత్వం బ్రతికే ఉందా... ఆ ఘటనపై చలించి పోయిన రష్మీ!

జీవహింస జరిగినట్లు రష్మీ గౌతమ్ తెలిస్తే సోషల్ మీడియా వేదికగా స్పందిస్తారు. తాజాగా కేరళలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. కొందరు వ్యక్తులు ఓ కుక్కను వ్రేలాడతీసి కర్రలతో కొట్టి చంపారు. 
 

rashmi gautam tweet to kerala cm as she witnessed inhuman act in kerala ksr
Author
Hyderabad, First Published Jul 3, 2021, 1:05 PM IST

స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ జంతు ప్రేమికురాలు. జీవ హింసను ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఖాళీ సమయాలలో వీధికుక్కలకు ఆహారం పెడుతూ మానవతావాదం చాటుకుంటూ ఉంటారు. ఇక జీవహింస జరిగినట్లు తనకు తెలిస్తే సోషల్ మీడియా వేదికగా స్పందిస్తారు. తాజాగా కేరళలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. కొందరు వ్యక్తులు ఓ కుక్కను వ్రేలాడతీసి కర్రలతో కొట్టి చంపారు. 


ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఆ నేరానికి పాల్పడిని వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అరెస్ట్ కాబడిన ముగ్గురు వ్యక్తులు బెయిల్ పై బయటికి రావడం జరిగింది. అమానుషంగా ఓ జీవిని చిత్రహింసలు పెట్టి ప్రాణాలు తీసిన వ్యక్తులు,గంటల వ్యవధిలో బెయిల్ పై బయటికి వచ్చి తిరుగుతున్నారు. దేశంలో చట్టాలు కఠినం చేయాలి అంటూ ఒకరు ట్వీట్ చేశారు. 


సదరు ట్వీట్ ని ట్యాగ్ చేసిన రష్మీ... ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆవేదన చెందారు. 100శాతం అక్షరాస్యత కలిగిన కేరళ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు ఊహించలేము. మీరు ప్రేలుడు పదార్థాలతో కూడిన ఆహారం ఏనుగులకు పెడుతున్నారు, అలాగే ఫిష్ హుక్ కి వ్రేలాడదీసి కుక్కను చంపుతున్నారు. అసలు మానవత్వం బ్రతికి ఉందా... అంటూ ట్వీట్ చేసింది. అలాగే తన ట్వీట్ కి కేరళ గవర్నర్, కేరళ సీఎంలను ట్యాగ్ చేసింది. మరి రష్మీ ట్వీట్ కి ఆ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఏమైనా  సమాధానం వస్తుందేమో చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios