యాంకర్‌ రష్మీ డాన్సర్‌ని ఆదుకోవాలని వేడుకుంటోంది. `ఢీ` షోలోని ఓ కంటెస్టెంట్‌ చాలా ఆపదలో ఉన్నారని, కరోనాతో తండ్రి చనిపోయారని, చాలా దీనస్థితిలో ఉందని ఆమెని ఆదుకోవాలని కోరుతుంది. తలా ఒక్క రూపాయి డొనేట్‌ చేయండంటూ పేర్కొంది. ఈ మేరకు ఇన్‌స్టా స్టోరీస్‌లో రష్మీ ఓ వీడియోని పంచుకుంది. ఇందులో ఆమె చెబుతూ, ``ఢీ` షోలో డాన్సర్‌ పవిత్ర అందరికి తెలిసే ఉంటుంది. ఆమె పరిస్థితి ఇప్పుడు బాగా లేదు. కరోనా వల్ల తల్లిదండ్రులు ఆసుపత్రి పాలయ్యారు. డబ్బులు లేకపోవడంతో తండ్రిని కాపాడుకోలేకపోయింది. ఆయన కన్నుమూశారు. వాళ్లు ఆర్థికంగా ఉన్నవాళ్లు కాదు. మనకంటే దీన స్థితిలో ఉన్నారు. వారికి సాయం చేద్దాం` అని తెలిపింది. 

ఇంకా చెబుతూ, `నా ఇన్‌స్టాగ్రామ్‌లో 3.3మిలియన్స్ ఫాలోవర్లు ఉన్నారు. అందరు తల ఒక్క రూపాయి ఇచ్చినా చాలు. కనీసం రెండు లక్షలైనా వారికి అందిద్దాం. ఇప్పుడు అందరు కష్టాల్లో ఉన్నారు. ఇది కష్టకాలం. కానీ పవిత్ర మనకంటే దారుణమైన పరిస్థితిలో ఉంది. కాబట్టి అందరం ఆమెకి సాయం చేద్దాం` అని తెలిపింది రష్మి. ఆమె చెప్పిన కొద్ది సమయంలోనే ఆ అమౌంట్‌ విరాళాల రూపంలో వచ్చింది. ఆ మొత్తాన్ని పవిత్ర కుటుంబానికి అందజేసింది. ఓ మంచి పనికి తనకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు` అని తెలిపింది రష్మీ. 

రష్మీ ప్రస్తుతం `జబర్దస్త్` షోకి యాంకర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. దీంతోపాటు `ఢీ` షో క్వీన్స్ టీమ్‌కి లీడర్‌గానూ వ్యవహరిస్తుంది. ఈ రెండు షోలో తనదైన అందం, అభినయంతో అలరిస్తుంది. దీంతోపాటు `బొమ్మ బ్లాక్‌బస్టర్‌` చిత్రంలోనూ నటిస్తుంది రష్మీ.