సరైన దుస్తులు ధరించాలని క్లాస్ పీకిన నెటిజన్ కి రష్మి ఘాటుగా బదులిచ్చింది. ఇటీవల బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఓ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం చీర కట్టుకొని ఫోటోషూట్ లో పాల్గొంది. అయితే ఆమె బ్లౌజ్ లేకుండా చీర కట్టుకొని ఫోటోలకు ఫోజిచ్చింది.

దీంతో నెటిజన్లు ఆమెపై మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఆమెని దారుణంగా ట్రోల్ చేశారు. అయితే కొందరు మాత్రం ఆమెకి సపోర్టివ్ గా మాట్లాడారు. భారతదేశంలో జాకెట్ లేకుండా చీరలు ధరించే మహిళలు కొందరు ఉన్నారని గుర్తు చేశారు. ఈ మేరకు బాలీవుడ్ లో కొన్ని వెబ్ సైట్లు కథనాలు ప్రచురించాయి.

జాకెట్ లేకుండా చీరకట్టుకోవడం పూర్వకాలం నుండి ఉందని ఓ వెబ్ సైట్ రాశిన కథనాన్ని రష్మి రీట్వీట్ చేశారు. దీన్ని ఓ నెటిజన్ విమర్శిస్తూ ట్వీట్ చేశారు. ఇలాంటి బట్టలు వేసుకోవడం వలన ఏమైనా ఉపయోగం ఉందా..? అని ప్రశ్నించాడు. ఇలాంటి బట్టలు కారణంగానే అమ్మాయిలు అత్యాచారాలకు గురవుతున్నారని మండిపడ్డాడు.

సరైన పొడవులు దుస్తులు ధరిస్తే దాదాపు నేరాలని తగ్గించవచ్చని అన్నారు. ఇది చూసిన రష్మి 'ఇలాంటి ఆలోచనలు ఉన్న నువ్వు పుట్టడమే ఓ పెద్ద నేరం' అంటూ ఘాటుగా బదులిచ్చింది. దీంతో నెటిజన్ వెంటనే తన ట్వీట్ ని తొలగించి.. మీకు నేను వ్యతిరేకం కాదు రష్మి గారు అంటూ మరో ట్వీట్ చేశారు. కొన్ని సందర్భాల్లో నేరాలు ఇలా కూడా జరుగుతుంటాయని, మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే క్షమించండి అంటూ ట్వీట్ చేశాడు.