ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన క్యూటీ బ్యూటీ రష్మిక మందన్న వరుస హిట్స్ తో దూసుకుపోతోంది. గీత గోవిందం హిట్ తో స్టార్ హీరోయిన్ గా మరీన ఈ బేబీకి అభిమానుల సంఖ్య బాగానే పెరిగింది. సోషల్ మీడియాలో అభిమానుల ప్రేమకు ఈ బ్యూటీ ఫిదా అవుతోంది. రీసెంట్ గా ఆమెకు సంబందించిన ఒక వీడియో అభిమానుల నుంచి రావడంతో భావోద్వేగానికి లోనైనట్లు చెప్పింది. 

హీరోయిన్స్ అన్నాక అభిమానులు ఎన్నో రకాలుగా వారిని ఇంప్రెస్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే వాటిని ఎవరు అంతగా పాటించుకోరు. కానీ రష్మిక మాత్రం ఆమె కోసం ఒక వీడియో ఎడిట్ చేసి ట్యాగ్ చేయడంతో వెంటనే స్పందించింది. 

నేను ఉహించ;లేదు. ఈ ఎడిట్ చూసిన అనంతరం కన్నీళ్లాగలేదు. ఇంత ప్రేమ నఎందుకు చుపిస్తున్నారో.. అసలు నేను అర్హురాలినో కాదో తెలియదు. నాకు సపోర్ట్ గా ఉన్నందుకు గర్వంగా ఉంది. హ్యాపీగా ఉంది. కన్నీళ్లు ఆగట్లెవు.  ఐ లవ్‌ యు సో మచ్‌ గాయ్స్‌’ అంటూ గీత గోవిందం బ్యూటీ స్పందించింది.