వరుస సినిమాలతో రాశి ఖన్నా బిజీగా ఉంది. సక్సెస్ లతో సంబంధం లేకుండానే సినిమా అవకాశాలను చేజిక్కించుకుంటోంది. ఇదే సమయంలో టీమిండియా క్రికెటర్ బుమ్రాను రాశి పెళ్లి చేసుకోనుందనే వార్తలు వచ్చాయి. ఓ షోలో ఈ వార్తలపై రాశి ఖండించింది. బుమ్రా ఒక క్రికెటర్ అని మాత్రమే తనకు తెలుసని... అంతకు మించి అతని గురించి తనకు ఏమీ తెలియదని చెప్పింది.

అతని మ్యాచ్ లు కూడా తాను చూడలేదని తెలిపింది. ఒక వ్యక్తిగా ఆయన ఎవరో కూడా తనకు తెలియదని చెప్పింది. ఈ రూమర్ ఎలా వచ్చిందో అర్థం కావడం లేదని తెలిపింది. కొన్ని హిందీ వెబ్ సైట్లు ఈ ప్రచారం చేశాయని చెప్పింది. ఇలాంటి రూమర్లు చిరాకును కలిగిస్తాయని తెలిపింది