విజయ్ సినిమాకి కోటి డిమాండ్ చేసిందట!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 16, Aug 2018, 10:49 AM IST
rashi khanna demanded one crore remuneration for geetha govindam
Highlights

రాశిఖన్నా మాత్రం పారితోషికం ఎక్కువ డిమాండ్ చేసి ఓ గీత గోవిందం సినిమాను మిస్ చేసుకుందట. ఇప్పుడు ఆ సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో అమ్మడు తెగ బాధపడిపోతుందట

టాలీవుడ్ కమర్షియల్ చిత్రాల్లో హీరోయిన్లకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు. అయినప్పటికీ వచ్చిన అవకాశాలను మిస్ చేసుకోరు. ఒక్కోసారి కథ బాగుండి తమ పాత్ర వైవిధ్యంగా ఉందంటే రెమ్యునరేషన్ తగ్గించుకొని మరీ నటిస్తారు. మంచి పాత్ర పడితే రెమ్యునరేషన్ పెద్దగా ఆలోచించరు. కానీ రాశిఖన్నా మాత్రం పారితోషికం ఎక్కువ డిమాండ్ చేసి ఓ గీత గోవిందం సినిమాను మిస్ చేసుకుందట.

ఇప్పుడు ఆ సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో అమ్మడు తెగ బాధపడిపోతుందట. ఎంతో నమ్మి చేసిన 'శ్రీనివాస కళ్యాణం' సినిమా రిజల్ట్ ఆశించిన విధంగా రాకపోవడం అదే సమయంలో విడుదలైన 'గీత గోవిందం'కి మంచి టాక్ రావడంతో అనవసరంగా మిస్ చేసుకున్నాను అంటూ తన సన్నిహితుల వాపోతుందని సమాచారం. మొదట 'గీత గోవిందం' సినిమాలో హీరోయిన్ గా రాశిని సంప్రదించగా కోటి రూపాయలు రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట.

ఆమె మార్కెట్ అంత లేకపోవడంతో నిర్మాతలు వెనక్కి తగ్గారు. దీంతో ఆ ఆఫర్ కాస్త రష్మిక కొట్టేసింది. హీరోయిన్ ప్రాధాన్యం గల ఈ సినిమాలో నటించిన రష్మిక ఆడియన్స్ ను మెప్పించింది. అయితే ఇప్పుడు రాశిఖన్నా, విజయ్ దేవరకొండ కలిసి ఓ సినిమాలో నటించబోతున్నారని సమాచారం. క్రాంతి మాధవ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. 

loader