మరింత ఆసక్తిగా మారనున్న బిగ్ బాస్ షో బిగ్ బాస్ హౌజ్ కి రాశిఖన్నా, నివేదా థామస్ ‘జై లవ కుశ’ ప్రమోషన్స్ కోసం రాశీ, నివేదా
ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరిస్తున్న తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్.. మరింత ఆసక్తిగా మారనుంది. మరో పది 9 రోజుల్లో ముగియనున్న బిస్ బాస్ షోకి ఇద్దరు అందమైన భామలు వెళ్లనున్నారు. వారే ‘జై లవ కుశ’ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించిన నివేదా థామస్, రాశీఖన్నా.
ఇప్పటికే నేనే రాజు నేనే మంత్రి సినిమా కోసం రానా, అర్జున్ రెడ్డి కోసం విజయ్ దేవర కొండ, ఆనందో బ్రహ్మ సినిమా కోసం తాప్సీ, మేడ మీద అబ్బాయి కోసం అల్లరి నరేష్, ఉంగరాల రాంబాబు సినిమా ప్రమోషన్స్ కోసం సునీల్, వీడెవడు సినిమా ప్రమోషన్స్ కోసం సచిన్ బిగ్ బాస్ హౌజ్ కి వెళ్లి సందడి చేశారు.
ఇప్పుడు ‘జై లవ కుశ’ సినిమా ప్రమోషన్స్ కోసం నివేదా, రాశీ ఖన్నాలు వెళ్లి సందడి చేయనున్నారు. వచ్చే శుక్రవారం ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన ఈ చిత్రం ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
