దిల్ రాజు నా ఫోన్ లాక్కొని వార్నింగ్ ఇచ్చారు: రాశిఖన్నా

First Published 6, Aug 2018, 6:12 PM IST
rashi khanna about dil raju and satish vegnesa
Highlights

డైరెక్టర్ సతీష్ కూడా పాత్రలో ఇన్వాల్వ్ అవ్వమని చెప్పేవారు. వారిద్దరూ పడ్డ కష్టం సినిమా అవుట్ ఫుట్ లో తెలిసింది. సినిమాలో నా పాత్రా పండడానికి కారణం కూడా వారిద్దరే

టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రాశిఖన్నా వరుస అవకాశాలు దక్కించుకుంటూ తన సత్తా చాటుతోంది. 'తొలిప్రేమ' చిత్రంతో తన ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెంచుకున్న ఈ నటి హీరోయిన్ గా నటించిన 'శ్రీనివాస కళ్యాణం' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా రాశి కొన్ని ఆసక్తికర విషయాలుచెప్పుకొచ్చింది . 'ఈ సినిమాలో శ్రీ అనే పాత్ర కోసం చాలా కష్టపడ్డాను.

నా పాత్ర చాలా ఎమోషనల్ గా ఉంటుంది. నాకు ఎలాంటి సందేహం కలిగినా.. వెంటనే దర్శకుడిని అడిగి తెలుసుకునేదాన్ని. అమలాపురంలోని పెళ్లి సన్నివేశాలు తీసే సమయంలో దిల్ రాజు చాలా కఠినంగా వ్యవహరించారు. సెట్ లో ఉన్నప్పుడు నాచేతిలో ఫోన్ ఉండకూడదని ఆయన ముందే చెప్పారు. కానీ నేను ఫోన్ పట్టుకొని ఉన్నానని నా చేతిలో ఫోన్ లాగేసుకొని వార్నింగ్ ఇచ్చారు.

ఫోకస్ మొత్తం షూటింగ్ మీదే పెట్టాలని దిల్ రాజు చెప్పారు. డైరెక్టర్ సతీష్ కూడా పాత్రలో ఇన్వాల్వ్ అవ్వమని చెప్పేవారు. వారిద్దరూ పడ్డ కష్టం సినిమా అవుట్ ఫుట్ లో తెలిసింది. సినిమాలో నా పాత్ర పండడానికి కారణం కూడా వారిద్దరే. ఈ సినిమా చూసిన మా ఫాదర్ ఎమోషనల్ అయి కంటతడి పెట్టుకున్నారు'' అని స్పష్టం చేశారు. 

loader