ఆస్ట్రేలియన్ పార్లమెంట్ లో అరుదైన గౌరవం పొందిన మ్యూజిక్ డైరెక్టర కోటి.
మొదటి సారి ఆస్ట్రేలియన్ పార్లమెంట్ లో అరుదైన గౌరవాన్ని పొందరు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కోటి. ఈ అవార్డ్ ను జాతికి అంకితం ఇస్తున్నట్టు ప్రకటించారు కోటి.

టాలీవుడ్ స్టార్ సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కోటీకి అరుదైన గౌరవం దక్కింది. తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటిసారి ఏ సంగీత దర్శకుడు అప్పటి వరకూ అందుకోని గౌరవాన్ని అందుకున్నారు కోటీ. ఫస్ట్ టైమ్ ఒక తెలుగు సంగీత దర్శకుడికి ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ పార్లమెంట్‌లో గౌరవ జీవిత సాఫల్య పురస్కారం దక్కింది. .. తెలుగు సినిమా సంగీతానికి కోటీ చేసిన సేవకుగాని గుర్తింపుగా ఈ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు కోటి.
ఆస్ట్రేలియాకు చెందిన ఎంపీ ఒకరు ఈ గౌరవాన్ని ఆయనకు అందజేశారు. మెంబర్ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ పార్లమెంట్ జూలియా ఫిన్ ..ఈ పురస్కారాన్ని కోటికి చేతికి ఇచ్చి సన్మానం చేశారు. ఇక పురస్కారంలో భాగంగా కోటికి ఒక జ్ఞాపిక, ప్రశంసా పత్రంబహూకరించారు. దాన్ని స్వీకరించిన కోటి తెలుగు ప్రేక్షకులు,భారతీయులందరితో పాటుకు, ఐక్యరాజ్య సమితి సభ్యలకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశానికి ఈపురస్కరాన్ని అంకితం చేస్తున్నట్లు కోటి ఈసందర్భంగా ప్రకటించారు. ప్రసంగం చివరిలో జైహింద్ అనిముగించారు.
దేశానికి తన పురస్కారాన్ని అంకితమివ్వడంతో జాతి పట్ల తనకున్న కృతజ్ఞతను గౌరవాన్ని బాధ్యతను చాటుకున్నారు.కోటికి పురస్కారం రావడం పట్ల ఆయన అభిమానులు సంతోషం వ్యాక్త చేస్తున్నారు. ఇక అలనాటి సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వరావుగారి తనయడు కోటీ.. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ గా సక్సెస్ ఫుల్ లైఫ్ ను కొనసాగిస్తూ వస్తున్నారు. గతంలో రాజ్ కొటీ ద్వయం సినిమాలకు సూపర హిట్ సంగీతాన్ని అందించే వారు. ఆతరువాత కాలంలో వీరు విడిపోయారు. అయితే కోటీ సక్సస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగగా..? రాజ్ మాత్రం కొన్ని సినిమాలు చేసి.. ఇండస్ట్రీ నుంచి పక్కకు వెళ్లిపోయారు. ఈమధ్యే రాజ్ గుండెపోటుతో మరణించారు.