బాలీవుడ్ లో స్టార్ హీరోలు ఎంత మంది ఉన్నా కూడా అందరిలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అందుకున్న వారిలో రన్ వీర్ సింగ్ ఒకరు. మినిమమ్ హిట్టు సినిమాలు వదిలే ఈ హీరో కథలను ఎంచుకోవడంలో చాలా డిఫరంటే గా ఆలోచిస్తాడు. రీసెంట్ గా టెంపర్ ను రీమేక్ చేసి హిట్టందుకున్న రన్ వీర్ త్వరలో డైరెక్ట్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 

కపిల్ దేవ్ బయోపిక్ '83'లో నటించబోతున్నట్లు వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. 1983లో కెప్టెన్ గా భారత్ కు మొదటి వరల్డ్ ను అందించిన క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ కు పూర్తిగా నటీనటుల ఎంపిక విధానం ఫైనల్ కి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక సినిమాను తెలుగులో అలాగే తమిళ్ కూడా ఒకేసారి తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. 

దీంతో బాలీవుడ్ స్టైలిష్ హీరో మొదటిసారి తెలుగు వైపు ఓ అడుగేయడానికి రెడీ అయ్యాడు. బజరంగీ  భాయీజాన్ - ఏక్ తా టైగర్ వంటి బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్న దర్శకుడు కబీర్ ఖాన్ ఈ చారిత్రాత్మక బయోపిక్ ని తెరకెక్కించనున్నాడు. ఇక విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమాలో నటించే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్ర కోసం అర్జున్ రెడ్డి హీరోను సంప్రదించారని సమాచారం.