ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాణీ ముఖర్జీని అభిమానులు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. దానికి కారణం ఆమె సెక్సువల్ హెరాస్మెంట్ కి సంబంధించి చేసిన కొన్ని కామెంట్స్. ఇటీవల ఓ నేషనల్ మీడియా నిర్వహించిన చర్చా వేదికలో బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకొన్, అనుష్క శర్మ, అలియా భట్, తాప్సీలతో పాటు రాణీ ముఖర్జీ కూడా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నటీమణులు 'మీటూ' ఉద్యమం గురించి తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ నేపధ్యంలో దీపికా, అనుష్క శర్మలు ఇంటి తరువాత అనుష్క శర్మలు అత్యంత సురక్షితంగాభావించాల్సిన ప్రదేశం వర్క్ ప్లేస్ అంటూ అక్కడ కూడా రక్షణ ఉండాలని అన్నారు.

వెంటనే సీన్ లోకి వచ్చిన రాణీముఖర్జీ.. మహిళలు స్వతహాగా బలవంతులుగా ఉండాలని, వేధింపులు ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కొనే ధైర్యం వారిలో ఉండాలని, దానికోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని సూచించారు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో రాణీ ముఖర్జీపై ట్రోలింగ్ మొదలైంది. అమ్మాయిలు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని మీరు చెప్పారు..

దానికి బదులు ప్రతీ తల్లి తన కొడుకును మంచి ప్రవర్తనతో పెంచాలని మీకు అనిపించడం లేదా..? అంటూ ప్రశ్నించారు. ఎందఱో పసికందులపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని, వారు మీరు చెప్పినట్లుగా  విద్యలు నేర్చుకునే అవకాశాలు లేవని విమర్శిస్తున్నారు. మరి ఈ విషయంపై రాణీ ముఖర్జీ ఎలా స్పందిస్తుందో చూడాలి!