రంగస్థలం టీజర్ రివ్యూ: చిట్టిబాబు కుమ్మి అవతల పడేశాడు..

First Published 24, Jan 2018, 5:25 PM IST
Rangasthalam Teaser review
Highlights
  • రంగస్థలం టీజర్ రివ్యూ
  • చిట్టిబాబు కుమ్మి అవతల పడేశాడు

రంగస్థలం టీజర్ అదుర్స్

మెగా పవర్ స్టార్ రాంచరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న రంగస్థలం చిత్రం టీజర్ అధికారికంగా విడుదలైంది. సినీ ప్రేక్షకులు, అభిమానుల్లో ఈ టీజర్ అంచనాలు పెంచింది. మాస్ ఎలిమెంట్స్‌తోపాటు, కొన్ని ఆహ్లాదకరమైన సన్నివేశాలు ఆకట్టుకొనేలా ఉన్నాయి.

 నా పేరు చిట్టిబాబండీ

 

నా పేరు చిట్టిబాబండీ

నా పేరు చిట్టిబాబు అండి.. మా ఊరికి నేనే ఇంజనీర్నండి..నాకు సౌండ్ వినిపించదు. కనిపిస్తుందండీ అంటూ 80 దశకంలో వాడిన పంపుసెట్టు స్టార్ట్ చేస్తూ రాంచరణ్ కనిపించాడు.

 గూబలు గుయ్‌మనేలా
  

గూబలు గుయ్‌మనేలా

ఏదో అన్నావురా.. పెదాలు మెదిలాయి అని కమెడియన్ సత్యను గుబలు గూయ్ అనేలా కొట్టాడు. అందుకే నన్ను అందరూ ఇంజినీర్ అంటారు అని ఓ చిన్న ట్విస్ట్ ఇచ్చాడు.

కత్తి పట్టుకొని రాంచరణ్
  

కత్తి పట్టుకొని రాంచరణ్

మా ఊరు రంగ.. రంగ.. రంగస్థలం అంటూ వచ్చే బ్యాక్ స్కోర్ వస్తుండగా రాంచరణ్ కత్తి పట్టుకొని ఆవేశంగా రావడంతో రంగస్థలం టీజర్ ముగిసింది.

వేటాడే సింహాంలా
  

వేటాడే సింహాంలా

టీజర్ మొదట్లో దట్టంగా గడ్డి మొలిచిన చేన్లో దేన్నో వేటాడే సింహంలా రాంచరణ్ కనిసిస్తాడు. పగ, ప్రతీకారం నేపథ్యంగా ఈ సినిమా ఉంటుందనే అభిప్రాయాన్ని కలిగింది.

80వ దశకం నాటి గ్రామీణ వాతావరణం

80వ దశకం నాటి పరిస్థితులు, గ్రామీణ వాతావరణం కళ్లకు కట్టినట్టుగా కనిపించాయి. వాస్తవంగా ఈ టీజర్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ ఉంది.

loader