MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Top 10 Heroes: దూసుకొచ్చిన అల్లు అర్జున్‌.. ఏమాత్రం తగ్గని మహేష్‌, చరణ్‌, తారక్‌.. నెంబర్‌ 1 మాత్రం ఇతనే

Top 10 Heroes: దూసుకొచ్చిన అల్లు అర్జున్‌.. ఏమాత్రం తగ్గని మహేష్‌, చరణ్‌, తారక్‌.. నెంబర్‌ 1 మాత్రం ఇతనే

ఇండియాలోనే టాప్‌ హీరోలు ఎవరనే చర్చ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. అయితే ప్రతి నెల ఈ లెక్కలు, స్థానాలు మారుతుంటాయి. మరి 2026 జనవరిలో ఇండియాలోనే టాప్‌ 10 హీరోలు ఎవరో చూద్దాం. 

3 Min read
Author : Aithagoni Raju
Published : Feb 20 2026, 07:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
ఇండియా టాప్‌ 10 హీరోలు
Image Credit : IBTimes

ఇండియా టాప్‌ 10 హీరోలు

ఇండియాలోనే పాపులర్‌ యాక్టర్స్ కి సంబంధించిన లిస్ట్ ని ఓర్మాక్స్ మీడియా ప్రతి నెల విడుదల చేస్తుంటుంది. హీరోల ఇమేజ్‌, పాపులారిటీ, డిస్కషన్‌, మార్కెటింగ్‌, ఫాలోయింగ్‌, సినిమాలు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని సర్వే చేసి ఈ లిస్ట్ ని ప్రతి నెల ఇస్తుంటుంది. ఈ క్రమంలో 2026లో జనవరి నెలలో ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన లెక్కల ప్రకారం టాప్‌ లో ఉన్నదెవరు? బాటమ్‌లో ఉన్నదెవరు? ఇండియా టాప్‌ 10లో ఎవరి స్థానం ఎంత అనేది తెలుసుకుందాం. ఈ నెలలో అల్లు అర్జున్‌ సత్తా చాటగా, మిగిలిన తెలుగు హీరోలు తమ స్టామినా చూపించారు. టాప్‌ స్టార్‌ని మాత్రం ఎవరూ టచ్‌ చేయలేకపోయారు.

28
ప్రభాస్‌ నెంబర్‌ 1
Image Credit : youtube/@PeopleMediaFactory

ప్రభాస్‌ నెంబర్‌ 1

ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన జనవరి నెల ఇండియా మోస్ట్ పాపులర్‌ మేల్ ఫిల్మ్ స్టార్‌ జాబితా చూస్తే, ఇందులో ఫస్ట్ ప్లేస్‌ డార్లింగ్‌ ప్రభాస్‌ కే దక్కింది. ఆయన తిరుగులేని విధంగా తన పాపులారిటీని చూపించారు. తనకు పోటీ ఎవరూ లేరని చాటి చెప్పారు. అంతేకాదు చాలా కాలంగా ప్రభాస్‌ నెంబర్‌ 1 స్థానంలో ఉంటున్న విషయం తెలిసిందే. ఆయన ఈ జనవరిలో `ది రాజాసాబ్‌` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఈ మూవీ ఆడలేదు. కానీ ప్రభాస్‌ గురించి చర్చ గట్టిగా జరిగిందని చెప్పొచ్చు.

Related Articles

Related image1
Nawab Cafe Review: నవాబ్‌ కేఫ్‌ మూవీ రివ్యూ, రేటింగ్‌.. ఛాయ్‌ వాలాపై వచ్చిన ఈ మూవీ ఎలా ఉందంటే?
Related image2
Hey Balwanth Movie Review: హే బల్‌వంత్‌ మూవీ రివ్యూ, రేటింగ్‌.. సుహాస్‌, వీకే నరేష్‌ మూవీ ఎలా ఉందంటే?
38
విజయ్‌ నెంబర్‌ 2
Image Credit : zoom

విజయ్‌ నెంబర్‌ 2

ఈ జాబితాలో రెండో స్థానంలో కోలీవుడ్‌ స్టార్‌ దళపతి విజయ్‌ ఉన్నారు. ఆయన కూడా గత కొన్ని నెలలుగా రెండో స్థానంలో నిలుస్తున్నారు. ప్రభాస్‌ మొదటి స్థానంలో ఎలాగో, విజయ్‌ రెండో స్థానం అలాగ అని చెప్పొచ్చు. విజయ్‌ నటించిన `జన నాయకుడు` మూవీ సంక్రాంతికి విడుదల కావాల్సింది. కానీ విడుదల ఆపాలని కొందరు కోర్ట్ కి వెళ్లడం, సెన్సార్‌ సమస్యలు వంటి కారణాలతో ఈ మూవీ ఆగిపోయింది. ఇప్పుడు చిత్ర బృందం తగ్గింది. కొన్ని సీన్లు కట్‌ చేశారు. దీంతో విడుదలకు గ్రీన్‌ సిగ్నల్‌ దొరికినట్టు సమాచారం.

48
అల్లు అర్జున్‌ నెంబర్‌ 3, షారూఖ్‌ నెంబర్‌ 4
Image Credit : Asianet News

అల్లు అర్జున్‌ నెంబర్‌ 3, షారూఖ్‌ నెంబర్‌ 4

ఈ లిస్ట్ లో గత నెల(డిసెంబర్‌)లో అల్లు అర్జున్‌ నాల్గో స్థానంలో ఉన్నారు. కానీ ఇప్పుడు ఆయన రైజ్‌ అయ్యారు. మూడో స్థానంలోకి వచ్చేశారు. బన్నీకి సంబంధించిన లోకేష్‌ కనగరాజ్ మూవీ ప్రకటన రావడం, అట్లీతో చేస్తున్న సినిమాకి సంబంధించిన డిస్కషన్‌ జరగడం, బన్నీ ప్రభావం పెరగడానికి కారణమయ్యిందని చెప్పొచ్చు. దీంతో నాల్గో స్థానం నుంచి మూడో స్థానంలోకి దూసుకొచ్చారు. ఇక నాల్గో స్థానంలో బాలీవుడ్‌ స్టార్‌ షారూఖ్‌ ఖాన్‌ ఉన్నారు. ఆయన మూడు నుంచి నాలుగుకి పడిపోయారు.

58
మహేష్‌ బాబు నెంబర్‌ 5, అజిత్‌ నెంబర్‌ 6
Image Credit : varanasi event

మహేష్‌ బాబు నెంబర్‌ 5, అజిత్‌ నెంబర్‌ 6

ఐదో స్థానం కూడా మన తెలుగు స్టార్‌దే. ఆయనే సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు. ప్రస్తుతం ఆయన రాజమౌళితో `వారణాసి` మూవీ చేస్తున్నారు. ఇది గ్లోబల్‌ ఫిల్మ్ గా రూపొందింది. దీనికి సంబంధించన చర్చ జరుగుతూనే ఉంది. ఆ మధ్య మహేష్‌ బాబు, రాజమౌళి, ప్రియాంక వంటి వారంతా ఇంటర్వ్యూలిచ్చారు. ఇది సినిమాపై, మహేష్‌ పై హైప్‌ని పెంచిందని చెప్పొచ్చు. అయితే గత నెలలో కూడా మహేష్‌ ఐదో స్థానంలో ఉన్నారు. ఇప్పుడు అదే స్థానాన్ని కాపాడుకున్నారు. ఆరో స్థానంలో కోలీవుడ్‌ స్టార్‌ అజిత్‌ ఉన్నారు.

68
రామ్‌ చరణ్‌ నెంబర్‌ 7
Image Credit : our own

రామ్‌ చరణ్‌ నెంబర్‌ 7

ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన లిస్ట్ లో రామ్‌ చరణ్‌ ఏడో స్థానంలో ఉన్నారు. ఆయన గత రెండు మూడు నెలలుగా అదే స్థానంలో ఉంటున్నారు. ఇప్పుడు `పెద్ది` సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ అయిన నేపథ్యంలో మున్ముందు తన స్థానం పెరిగే అవకాశం ఉంది. ఈ సినిమా ఏప్రిల్‌ ఎండింగ్‌లో విడుదల కాబోతుంది.

78
ఎన్టీఆర్‌ నెంబర్‌ 8
Image Credit : X/@AmardeepKushw20

ఎన్టీఆర్‌ నెంబర్‌ 8

ఎనిమిదో స్థానంలో ఎన్టీఆర్‌ ఉన్నారు. ఆయన కూడా గత మూడు నాలుగు నెలలుగా అదే స్థానంలో ఉంటున్నారు. తారక్‌ ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌తో `డ్రాగన్‌` చిత్రంలో నటిస్తున్నారు. ఆయన సినిమాకి సంబంధించిన డిస్కషన్‌ గతేడాది బాగానే జరిగింది. ఇటీవల కొత్త లుక్‌లో కనిపించి ఆశ్చర్యపరిచారు. వచ్చే నెలలో ఆయన కూడా తన సత్తాని చాటే ఛాన్స్ ఉంది.

88
సల్మాన్‌ నెంబర్‌ 9, అక్షయ్‌ నెంబర్‌ 10
Image Credit : our own

సల్మాన్‌ నెంబర్‌ 9, అక్షయ్‌ నెంబర్‌ 10

ఇక తొమ్మిది, పది స్థానాలు బాలీవుడ్‌ నటులు ఆక్రమించారు. తొమ్మిదో స్థానంలో కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ ఉన్నారు. పదో స్థానంలో అక్షయ్‌ కుమార్‌ నిలిచారు. వీరిద్దరు కూడా నెమ్మదిగా తమ స్థానాల్లో స్ట్రాంగ్‌గా సెటిల్‌ అవుతున్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
మహేష్ బాబు ఘట్టమనేని
ప్రభాస్
రామ్ చరణ్ కొణిదెల
అల్లు అర్జున్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
ఫ్లాప్ డైరెక్టర్స్ తో సినిమాలపై రాంచరణ్ రియాక్షన్.. ఆరెంజ్ మూవీనే కారణం అంటూ షాకింగ్ కామెంట్స్
Recommended image2
Prabhas: ఈ చిన్న సినిమాను తెగ పొగిడేసిన ప్రభాస్, మరొక నాలుగు సార్లు చూస్తానని కామెంట్
Recommended image3
Shakeela: వేణు మాధవ్ రూమ్ లో పడుకున్న షకీలా.. మంచి స్నేహితుడు అనుకున్నా, కానీ ఇలా చేస్తాడనుకోలేదు
Related Stories
Recommended image1
Nawab Cafe Review: నవాబ్‌ కేఫ్‌ మూవీ రివ్యూ, రేటింగ్‌.. ఛాయ్‌ వాలాపై వచ్చిన ఈ మూవీ ఎలా ఉందంటే?
Recommended image2
Hey Balwanth Movie Review: హే బల్‌వంత్‌ మూవీ రివ్యూ, రేటింగ్‌.. సుహాస్‌, వీకే నరేష్‌ మూవీ ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved