రంగస్థలం షో అక్కడ మధ్యలో ఆపేశారు.. తీవ్ర ఉద్రిక్తత

First Published 31, Mar 2018, 10:49 AM IST
Rangasthalam show stopped in nandigama
Highlights
రంగస్థలం షో అక్కడ మధ్యలో ఆపేశారు

 రంగస్థలం చిత్రం భారీ అంచనాలతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంచనాలకు తగ్గట్లుగానే చిత్రం ఉండడంతో తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీనితో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. రాంచరణ్ నటన, దర్శకుడు సుకుమార్ టేకింగ్, సమంత, ఆది పినిశెట్టి మరియు జగపతి బాబు పెర్ఫామెన్స్ చిత్రాన్ని మరో లెవల్ కు తీసుకుని వెళ్లాయని ప్రశంసలు దక్కుతున్నాయి.

 కృష్ణ జిల్లా నందిగామలో మయూరి థియేటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. థియేటర్ యాజమాన్యం పరిమితికి మించిన ధరలతో రంగస్థలం చిత్ర టికెట్స్ ని విక్రయిస్తోందని ఫిర్యాదు కలెక్టర్ కు చేరింది. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎమ్మార్వో థియేటర్ కు వెళ్లారు. తనిఖీ పేరుతో రంగస్థలం చిత్ర ప్రదర్శనని మధ్యలో ఆపివేయడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసారు. దీనితో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

loader