పవన్ రికార్డులను దులిపేస్తున్న రాంచరణ్

First Published 12, Mar 2018, 2:38 PM IST
Rangasthalam Record bussiness in ceeded
Highlights
  • మెగా పవర్‌స్టార్ రాంచరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్నచిత్రం రంగస్థలం
  • రంగస్థలం చేస్తున్న ప్రీ రిలీజ్ బిజినెస్ చూసి టాలీవుడ్ వర్గాలు షాక్ తింటున్నాయి
  • సీడెడ్ లో రికార్డు స్థాయి బిజినెస్

మెగా పవర్‌స్టార్ రాంచరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. రంగస్థలం చేస్తున్న ప్రీ రిలీజ్ బిజినెస్ చూసి టాలీవుడ్ వర్గాలు షాక్ తింటున్నాయి. సీడెడ్‌లో ఈ చిత్రం రికార్డు స్థయిలో బిజినెస్ జరిగింది. జైలవకుశ, కాటమరాయుడు తర్వాత ఆ స్థాయిలో జరిగింది రంగస్థలానికే.దర్శకుడు సుకుమార్ రూపొందించిన చిత్రాలను, రాంచరణ్ నటించిన సినిమా బిజినెస్‌లను పోల్చుకొంటే రంగస్థలం చిత్రం భారీస్థాయిలో వ్యాపారం చేస్తున్నది. మిగితా ఏరియాలో కూడా రికార్డు స్థాయి బిజినెస్ జరుగుతున్నట్టు సమాచారం.

ట్రేడ్ అనలిస్తుల రిపోర్టు ప్రకారం.. రంగస్థలం సినిమా సీడెడ్ థియేట్రికల్ హక్కులను ప్రముఖ పంపిణీదారుడు రూ.12.1 కోట్లకు దక్కించుకొన్నట్టు సమాచారం. దాంతో ఈ సినిమాపై మరింత హైప్ పెరిగింది.బాహుబలిని పక్కన పెడితే  ఎన్టీఆర్ నటించిన జైలవకుశ 12 కోట్ల బిజినెస్ చేసింది. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన కాటమరాయుడు చిత్రం రూ.11.7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 

ఇక నైజాం విషయానికి వస్తే రంగస్థలం చిత్రం దాదాపు 20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తున్నది. నైజాంలో మెగా ఫ్యాన్స్ క్రేజ్ ఎక్కువగా ఉండటంతో భారీ మొత్తాన్ని చెల్లించి థియట్రికల్ హక్కులను దక్కించుకొన్నట్టు తెలుస్తున్నది.

రాంచరణ్, సమంత, జగపతిబాబు తదితరులు నటించిన రంగస్థలం చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ చిత్రం మార్చి 30న రిలీజ్‌కు ముస్తాబవుతున్నది. 1980 నాటి పరిస్థితుల కథాంశం, నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

loader