MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Rashmika - Vijay Wedding: రష్మిక - విజయ్ పెళ్లికి ఇంటర్నేషనల్ సెక్యూరిటీ, మీడియాకు నో ఎంట్రీ.. కారణం ఏంటి?

Rashmika - Vijay Wedding: రష్మిక - విజయ్ పెళ్లికి ఇంటర్నేషనల్ సెక్యూరిటీ, మీడియాకు నో ఎంట్రీ.. కారణం ఏంటి?

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం జరగనుందట. కట్టుదిట్టమైన భద్రత, కొద్దిమంది అతిథులు, మీడియాకు అనుమతి లేకుండా ఈ పెళ్లి జరగబోతోందని సమాచారం.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 20 2026, 12:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
26న రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి..?
Image Credit : GA2 Pictures

26న రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి..?

టాలీవుడ్ స్టార్స్ రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఫిబ్రవరి 26న పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలొస్తున్నాయి. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం జరగనుంది. మిగతా సెలబ్రిటీల పెళ్లిళ్లలా ఆడంబరంగా కాకుండా, కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుకను జరుపుకోవాలని ఈ జంట నిర్ణయించుకుంది.

సమాచారం ప్రకారం, ఉదయ్‌పూర్‌లోని ఓ పెద్ద, ఏకాంత ప్రదేశంలో ఈ వేడుక జరగనుంది. ఏర్పాట్లన్నీ చాలా నిశ్శబ్దంగా చేస్తున్నారు. పూర్తి గోప్యత పాటించాలని వెండర్లకు సూచించారు. కొద్ది మందికి మాత్రమే పూర్తి వివరాలు తెలుసట. అందుకే ఈ మధ్య కాలంలో ఇదే అత్యంత రహస్యంగా జరుగుతున్న సెలబ్రిటీ పెళ్లి అని అంటున్నారు.

24
అంతర్జాతీయ సెక్యూరిటీ మధ్య రహస్య వివాహం..?
Image Credit : GA2 Pictures

అంతర్జాతీయ సెక్యూరిటీ మధ్య రహస్య వివాహం..?

ఈ పెళ్లిలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న విషయం ఏంటంటే.. ఓ అంతర్జాతీయ సెక్యూరిటీ ఏజెన్సీని రంగంలోకి దించడం. పెళ్లికి సంబంధించిన ఏ చిన్న విషయం కూడా బయటకు పొక్కకుండా ఉండేందుకు, ఈ జంట ఓ ప్రత్యేక విదేశీ సెక్యూరిటీ టీమ్‌ను నియమించుకుందని చెబుతున్నారు.

ఈ టీమ్ రాజస్థాన్ స్థానిక అధికారులతో కలిసి పనిచేస్తుందట. పెళ్లి మండపాకి భద్రత కల్పించడం, అతిథుల రాకపోకలను నిర్వహించడం వంటివి చూసుకుంటుంది. ఎలాంటి అనవసరమైన చొరబాట్లు జరగకుండా పటిష్టమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయడమే వీరి లక్ష్యం.

Related Articles

Related image1
Naa Anveshana: యూట్యూబర్ అన్వేష్ కు దిమ్మతిరిగే షాక్.. ఇన్‌స్టాగ్రామ్ ఏం చేసిందంటే?
Related image2
Punarnavi Bhupalam : పెళ్లి పీటలెక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ, ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న పునర్నవి
34
 4న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్..?
Image Credit : GA2 Pictures

4న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్..?

అంతే కాదు ప్లానింగ్ చాలా పక్కాగా చేశారని సమాచారం. ఆహ్వానాలు కూడా చాలా రహస్యంగా పంపారట. జంట అధికారికంగా ప్రకటించే వరకు మౌనంగా ఉండాలని స్నేహితులు, కుటుంబ సభ్యులను కూడా కోరినట్లు తెలుస్తోంది.

పెళ్లి చాలా ప్రైవేట్‌గా జరిగినప్పటికీ, మార్చి 4న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమ స్నేహితులు, ప్రముఖులు హాజరవుతారని అంచనా.

అయితే, పెళ్లికి తీసుకున్న గోప్యతా చర్యలే ఇక్కడా కొనసాగుతాయి. పెళ్లికి, రిసెప్షన్‌కు కూడా మీడియాను అనుమతించడం లేదని గట్టిగా చెబుతున్నారు. వివాహ ప్రాంగణం లోపలికి కెమెరాలకు, ప్రెస్‌కు అనుమతి ఉండదు.

44
టాలీవుడ్‌లో ఇది అతిపెద్ద సెలబ్రిటీ పెళ్లి
Image Credit : stockPhoto

టాలీవుడ్‌లో ఇది అతిపెద్ద సెలబ్రిటీ పెళ్లి

ఈ వారం మొదట్లో, ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైన ఓ పెళ్లి కార్డు పెద్ద సంచలనం సృష్టించింది. విజయ్, రష్మిక సంతకాలతో ఉన్నట్లు చెబుతున్న ఆ కార్డులో.. తమ కుటుంబాల ఆశీర్వాదంతో 26.02.26న 'చిన్న, సన్నిహితుల మధ్య వేడుక'లో పెళ్లి చేసుకోబోతున్నట్లు రాసి ఉంది.

ఈ వార్తలే నిజమైతే, ఈ ఏడాది టాలీవుడ్‌లో ఇది అతిపెద్ద సెలబ్రిటీ పెళ్లి అవుతుంది. నిశ్శబ్దంగా జరుపుకుంటున్నా, దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు మాత్రం ఈ వేడుకను చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
విజయ్ దేవరకొండ
రష్మిక మందన్న
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Naa Anveshana: యూట్యూబర్ అన్వేష్ కు దిమ్మతిరిగే షాక్.. ఇన్‌స్టాగ్రామ్ ఏం చేసిందంటే?
Recommended image2
Illu Illalu Pillalu Today Episode Feb 20: భర్త చెంప పగలగొట్టిన నర్మద, భార్య కాళ్లు పట్టుకున్న సాగర్
Recommended image3
Hey Balwanth Movie Review: హే బల్వంత్‌ మూవీ రివ్యూ, రేటింగ్‌.. సుహాస్‌, వీకే నరేష్‌ మూవీ ఎలా ఉందంటే?
Related Stories
Recommended image1
Naa Anveshana: యూట్యూబర్ అన్వేష్ కు దిమ్మతిరిగే షాక్.. ఇన్‌స్టాగ్రామ్ ఏం చేసిందంటే?
Recommended image2
Punarnavi Bhupalam : పెళ్లి పీటలెక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ, ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న పునర్నవి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved