రాంచరణ్ కు ఓవర్సీస్ లో ఈసారి గట్టి దెబ్బ తగిలేలా ఉంది.?

రాంచరణ్ కు ఓవర్సీస్ లో ఈసారి గట్టి దెబ్బ తగిలేలా ఉంది.?

 సుకుమార్ సినిమాలకు ఓవర్సీస్ లో ఓపెనింగ్స్ భారీగా ఉంటుంది. నాన్నకు ప్రేమతో ఇక్కడ మాస్ కి పూర్తిగా కనెక్ట్ కాకపోయినా అమెరికాలో మాత్రం 2 మిలియన్ డాలర్ క్లబ్ లో త్వరగా చేరిపోవడం దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు.  కాని విచిత్రంగా యుఎస్ లో సుకుమార్ దర్శకత్వంలో మెగా హీరో సినిమా రంగస్థలం వస్తోంది అన్న హడావిడే ఎక్కడా కనిపించడం లేదు. కారణం అక్కడి డిస్ట్రిబ్యూటర్ ప్లానింగ్ లోపమే అని సమాచారం. విడుదల తేదిని చాలా రోజల క్రితమే కన్ఫర్మ్ చేసినా దానికి తగట్టు స్క్రీన్స్ ని సెట్ చేసుకోవడం కాని థియేటర్ లను బుక్ చేసుకోవడం లాంటి చర్యలేవి తీసుకోకపోవడంతో సరైన లోకేషన్స్ కూడా దొరకలేదని వస్తున్న వార్త మెగా ఫాన్స్ ని కలవరపెడుతోంది. 

పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇబ్బంది తప్పదు. రామ్ చరణ్ కు ఓవర్సీస్ క్రేజ్ చాలా తక్కువ. అక్కడ టాక్ కొంచెం తేడా కొట్టిన అతని కలక్షన్లు కుప్పకూలిపోతాయి  . అలాంటప్పుడు ముందు జాగ్రత్తగా అక్కడి డిస్ట్రిబ్యూటర్ తో నిర్మాతలు కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూసుకుని ఉంటే ఇప్పుడు ఇంత హైప్ లెస్ గా మూవీ ఉండేది కాదు అన్నది పచ్చి నిజం. మరి ఈ మూడు రోజులు ఏదైనా అద్భుతం చేస్తారా అని ఆశించలేం కాని ఈ వ్యవహారం పట్ల ఫాన్స్ మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos