చివరగా `ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి` చిత్రంతో పరాజయాన్ని అందుకున్నారు నాగశౌర్య. ఇప్పుడు ఆయన `రంగబలి` అంటూ వస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. 

`ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి`తో డిజప్పాయింట్‌ చేశాడు నాగశౌర్య. ఈ సినిమా దారుణంగా బోల్తా కొట్టింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రూట్‌ మార్చాడు. `ఛలో` స్టయిల్‌లో ఫన్‌, యాక్షన్‌ మేళవింపుతో `రంగబలి` సినిమా చేశాడు. కమర్షియల్‌ అంశాలతో ఈ చిత్రం రూపొందింది. పవన్‌ బసంశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇందులో `దసరా` విలన్‌ షైన్‌ టామ్‌ చాకో నెగటివ్‌ రోల్‌ చేస్తుందటం విశేషం. 

తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో ట్రైలర్‌ని రిలీజ్‌ చేశారు. ఫన్‌, లవ్‌, యాక్షన్‌, ఊరు సెంటిమెంట్‌,యూత్‌కి కావాల్సిన ఎలిమెంట్లతో సాగుతూ ఆద్యంతం ఆకట్టుకుంటుంది `రంగబలి` ట్రైలర్‌. ఫన్‌, యాక్షన్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా సాగుతుందని ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతుంది. సినిమాలో డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి. కమెడియన్‌ సత్య.. రోడ్ల మీద తెనె అమ్మేసినట్టు స్మెర్మ్ అమ్ముకుద్దామని చెప్పే సీన్లు, అలాగే ఊరు గురించి నాగశౌర్య చెప్పే డైలాగులు, విలన్‌ సన్నివేశాలు, రంగబలి ఊర్లో హింసా కాండతో కూడిన సీన్లు ఆకట్టుకుంటున్నాయి. 

సొంతూరు గొప్పతనం చెప్పే సీన్లు హైలైట్‌గా నిలుస్తున్నాయి. సొంతూరు గురించే ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. అంతేకాదు `బయటూర్లో బానిసలా బతికినా ఫర్లేదు బయ్యా.. కానీ సొంతూరు మాత్రం సింహాంలా ఉండాలి` అని శౌర్య చెప్పిన డైలాగ్‌ ట్రైలర్‌లో హైలైట్ అవుతుంది. దీనికితోడు విలన్‌కి వార్నింగ్‌ ఇచ్చే క్రమంలో ట్రైలర్‌లో ఊరమాస్‌(బూతు) డైలాగులు కూడా ఉండటం హాట్‌ టాపిక్‌ అవుతుంది. చాలా రోజుల తర్వాత నాగశౌర్య మంచి కంటెంట్‌తో వస్తున్నారని అర్థమవుతుంది. శౌర్యకి చాలా కాలంగా సరైన హిట్‌ లేదు. దీంతో తాజాగా ట్రైలర్‌ చూస్తుంటే హిట్‌ పక్కా అనేలా అనిపిస్తుంది. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ సంస్థ నిర్మిస్తుంది. యుక్తీ దరేజా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం జులై 7న విడుదల కాబోతుంది.

YouTube video player